Fri Mar 28 2025 15:39:09 GMT+0000 (Coordinated Universal Time)
చద్దన్నం - సమ్మర్ లో సర్వరోగాలు మటుమాయం
చద్దన్నం విలువ, దాని ద్వారా శరీరానికి అందే పోషకాలు వింటే మీరు కూడా దానిని వదిలరు.

పెద్దల మాట చద్దన్నం మూట సామెత అందరికీ తెలిసిందే. చద్దన్నం విలువ తెలిస్తే ఎవరూ ఈ పిజ్జాలు, బర్గర్ల జోలికి అసలే పోరు. అందుకే నేడు ఫైవ్ స్టార్ హోటల్స్ లోనూ చద్దన్నం ప్రత్యేక డిష్ గా వందల రూపాయలకు విక్రయిస్తున్నారు. అమెరికావంటి దేశాల్లో సయితం చద్దన్నం ఇటీవల కాలంలో పాపులర్ అయింది. అనేక పాశ్చాత్య దేశాల్లో చద్దన్నం ఇప్పుడు బ్రేక్ ఫాస్ట్ లో ప్రధానమైనదిగా మారిపోయింది. చద్దన్నం విలువ, దాని ద్వారా శరీరానికి అందే పోషకాలు వింటే మీరు కూడా దానిని వదిలరు. ప్రతిరోజూ ఉదయాన్నే ఇడ్లీలు, దోసెలు, పూరీల స్థానంలో చద్దన్నాన్ని తప్పకుండా చేరుస్తారు. అందుకే చద్దన్నం విలువ తెలిసే అనేక ఆసక్తికరమైన విషయాలు మీకోసమే.
చద్దన్నంతో ఎన్ని లాభాలు ఉన్నాయో చూద్దాం..
1. టిఫిన్ అనగానే మనకు గుర్తొచ్చేది ఇడ్లీ, దోశ, చపాతి కానీ రాత్రి వండిన అన్నాన్ని తెల్లవారి ఆవకాయ, పెరుగు, కలుపుకుని పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ నంజుకుని తింటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.
2. చద్దన్నం ఫులవడం ఒక రాత్రి ఉండడం వల్ల పోషక విలువలు పెరగనున్నాయి. ఉదాహరణకు 50 గ్రాముల అన్నాన్ని తీసుకొని రాత్రి పుల్లపెట్టినట్లయితే1.6 మిల్లీగ్రాములు ఉన్న ఐరన్ 35 మిల్లీగ్రాములుగా పెరుగుతుంది. అలాగే పొటాషియం మరియు క్యాల్షియంలు కూడా భారీ మొత్తంలో పెరుగుతాయని నిపుణులుచెబుతున్నారు.
3. రాత్రిపూట మిగిలిన అన్నంలో కొంచెం పాలు పచ్చి ఉల్లిపాయ ముక్కలు అల్లం కరివేపాకు జీలకర్ర వేసి కలిపి దానిలో కొంచెం పెరుగు వేసి పొద్దునే తింటే అనారోగ్య సమస్యలు అన్ని తొలగిపోతాయి ఎముకలకు బలం కూడా చేకూరుతుందని వైద్యులు కూడా సూచిస్తున్నారు.
4. వేడి ఎక్కువగా ఉన్నవారు చద్దన్నంలో పెరుగు పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని తింటే వేడి తగ్గుతుంది.
5. చద్దన్నం తింటే మంచిదే కదా అని మధ్యాహ్నం సాయంత్రం తినకూడదు. తెల్లారిన తర్వాత కూడా ఎక్కువ సమయం అలాగే ఉంచితే అది పాడైపోయే అవకాశం ఉంది అందుకే ఉదయం తొమ్మిది గంటల్లోపే తినేయాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
6. పేగుల్లో ఉండే అనారోగ్య సమస్యలకు సైతం ఈ చద్దన్నం తగ్గిస్తుందని చెబుతున్నారు.
7. అనేక చర్మ వ్యాధుల నుండి చద్దన్నం కాపాడుతుందనికూడా చెబుతుండటంతో చద్దన్నం విలువ ఇప్పటికైనా అర్థమయందిగా. ఇక రోజూ తినేయండి మరి.ఆరోగ్యాన్నికాపాడుకోండి.
Next Story