మీరు టాయిలెట్లో ఎక్కువ సమయం గడుపుతున్నారా? ప్రమాదమే!
ప్రపంచ జనాభాలో 4.4 శాతం మంది పైల్స్ లేదా హెమోరాయిడ్స్ సమస్యను ఎదుర్కొంటున్నారని అంచనా. ఇది ప్రారంభ దశలో చికిత్స
ప్రపంచ జనాభాలో 4.4 శాతం మంది పైల్స్ లేదా హెమోరాయిడ్స్ సమస్యను ఎదుర్కొంటున్నారని అంచనా. ఇది ప్రారంభ దశలో చికిత్స చేయకపోతే అనేక తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ ప్రకారం.. 50% మంది ప్రజలు 50 సంవత్సరాల వయస్సులో ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ముందుగా ఉన్న జీర్ణ సమస్యలతో సహా అనేక అంశాలు పైల్స్‌కు దారితీయవచ్చు. దీనితో పాటు మరింత ఆశ్చర్యకరమైన వాస్తవం ఏమిటంటే, టాయిలెట్లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా పైల్స్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.
టాయిలెట్ కమోడ్‌పై ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల పైల్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని గురుగ్రామ్‌లోని మణిపాల్ హాస్పిటల్‌లోని డాక్టర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఉద్ధవేష్ పైఠాంకర్ హెచ్చరించారు. టాయిలెట్ సీటుపై ఎక్కువసేపు కూర్చోవడం వల్ల రక్త నాళాలు వాపుకు కారణమవుతాయి. దీనివల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందంటున్నారు. టాయిలెట్ సీటుపై ఎక్కువ సేపు కూర్చోవడం మలవిసర్జన సమయంలో రక్తనాళాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఇది హేమోరాయిడ్స్‌కు దారితీస్తుంది.
అన్నాలి ఇటాలియన్ డి చిరుర్గియాలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. టాయిలెట్లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల హెమోరాయిడ్స్ వచ్చే అవకాశం ఉంది. హేమోరాయిడ్స్‌తో బాధపడుతున్న 52 మంది స్థూలకాయ రోగులను విశ్లేషించిన తర్వాత ఎవరైనా టాయిలెట్ రూమ్‌లో ఎక్కువసేపు గడిపినట్లయితే వారి హెమోరాయిడ్స్ ప్రమాదం మరింత తీవ్రంగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, నీళ్లు తాగడం, ఎక్కువ సేపు టాయిలెట్లో కూర్చోవడం మానుకోవడం వల్ల పురిటి నొప్పులు రాకుండా చూసుకోవచ్చునని చెబుతున్నారు.
అదనంగా గర్భధారణ, ప్రసవ సమయంలో హార్మోన్ల మార్పులు, ఇంట్రా-అబ్డామినల్ ప్రెజర్ పెరగడం వల్ల హెమోరాయిడ్స్ వచ్చే అవకాశం ఉంది. కెనడాకు చెందిన కాలేజ్ ఆఫ్ ఫ్యామిలీ ఫిజిషియన్స్ అధికారిక ప్రచురణలో ప్రచురించబడిన ఒక అధ్యయనం సుమారుగా 25-35 శాతం మంది గర్భిణులు హెమరాయిడ్స్తో బాధపడుతున్నారు.
తీసుకోవలసిన జాగ్రత్తలు
- ఫైబర్ ఉన్న పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారాలు పుష్కలంగా తినండి.
- నీరు, ఇతర ద్రవ ఆహారాలు ఎక్కువగా తీసుకోండి.
- కొవ్వు పదార్ధాలు, మద్యంను పరిమితం చేయండి.
- క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయండి.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.