'బరువు' పెరగాలనుకుంటున్నారా.? అయితే 'బంగాళదుంపలు' ట్రై చేయండి..!
మీరు సన్నగా బక్కచిక్కిపోయి ఉన్నారా..? బరువు పెరగడం కోసం ఆసుపత్రుల చుట్టూ
మీరు సన్నగా బక్కచిక్కిపోయి ఉన్నారా..? బరువు పెరగడం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ వేలకువేలు ఖర్చు చేస్తున్నారా..? అయితే.. ఇలా కూడా ట్రై చేయండి. మీరు బరువు పెరగాలనుకుంటే మీ ఆహారంలో బంగాళదుంపలను తీసుకోండి. బంగాళదుంపలలో కాల్షియం, ఫైబర్, జింక్ వంటి పోషకాలు ఉంటాయి. పిల్లలు, పెద్దలు అందరూ దీన్ని ఇష్టంగా తింటారు. సన్నగా ఉన్నవారు బంగాళదుంపలు తినడం మంచిది. బరువు పెరగడానికి బంగాళదుంపలను ఏయే మార్గాల్లో తినాలో తెలుసుకుందాం.
బంగాళదుంప హల్వా బరువు పెరగడానికి చాలా సహాయపడుతుంది. మీకు తీపి ఇష్టమైతే మీరు ప్రతిరోజూ మీ ఆహారంలో బంగాళాదుంప హల్వాను తీసుకోవచ్చు. ఇది బరువు పెరగడంలో మీకు సహాయపడుతుంది. ఈ హల్వా రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
బరువు తగ్గే సమస్య ఉన్నవారు తప్పనిసరిగా ఉడికించిన బంగాళదుంపలను తినాలి. ఉడకబెట్టిన బంగాళదుంపల్లో నల్ల ఉప్పు చల్లితే రుచిగా ఉంటుంది. మీరు ఉడికించిన బంగాళాదుంపలను క్రమం తప్పకుండా తినడం వల్ల మీ బరువు పెరుగవచ్చు.
బంగాళదుంప కూర అంటే అందరికీ ఇష్టం. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. బరువు పెరగడానికి.. మీరు రోజువారీ ఆహారంలో బంగాళాదుంప కూర ఉంచుకునేలా చూసుకోండి.
బంగాళదుంపలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
బంగాళదుంపలలో ఉండే అనేక విటమిన్లు, ఖనిజాలు మెదడుకు మేలు చేస్తాయి.
పోషకాలు అధికంగా ఉండే బంగాళదుంపలు జీర్ణక్రియకు ఉపయోగపడతాయి. మీకు అతిసార వ్యాధి లక్షణాలు ఉంటే.. బంగాళాదుంపలు త్వరగా కోలుకోవడానికి మీకు సహాయపడతాయి.
క్యాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉండే బంగాళదుంపలు ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి.
బంగాళాదుంప చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. మీరు దీన్ని ఫేస్ మాస్క్‌లలో ఉపయోగించవచ్చు. ఇది మొటిమలు, మచ్చలు వంటి ఇతర చర్మ సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.