Sun Dec 22 2024 11:31:36 GMT+0000 (Coordinated Universal Time)
చీమలు కుట్టడంతో ఆసుపత్రి పాలైన టెకీ
చీమలతో కుట్టించుకోవడం మనుషులకు కొత్తేమీ కాదు. మహా అయితే చిన్న చిన్న
చీమలతో కుట్టించుకోవడం మనుషులకు కొత్తేమీ కాదు. మహా అయితే చిన్న చిన్న దద్దుర్లు వస్తాయని అందరూ లైట్ గా తీసుకుంటాం. అయితే హైదరాబాద్‌లోని 28 ఏళ్ల ఐటీ ఉద్యోగి ఎర్ర చీమల కారణంగా ఏకంగా ఆసుపత్రి పాలయ్యాడు. ఎర్ర చీమలు సాధారణంగా ప్రాణాంతకమైనవి కాదని వైద్యులు, నిపుణులు చెబుతూ వస్తున్నారు. అవి తేనెటీగలు, కందిరీగలు వంటి హైమెనోప్టెరా కుటుంబానికి చెందినవి. ఎర్ర చీమలకు తీవ్రమైన అలెర్జీని కలిగించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని అలెర్జీ సూపర్ స్పెషలిస్ట్ & ఇమ్యునాలజిస్ట్, డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ తెలిపారు.
భారతదేశంలోనే రెడ్ యాంట్ అలెర్జీకి సంబంధించి మొదటి కేసు అని వైద్యులు తెలిపారు. 28 ఏళ్ల వ్యక్తి తన ఇంటిలో తోటపని చేస్తుండగా అతని కాలికి చీమలు కుట్టాయి. సరిగ్గా 30 నిమిషాల తర్వాత అతని కళ్ళు మండుతున్నట్లు అనిపించాయి, గొంతు లో నుండి మాటలు రాలేదు, చర్మంపై విపరీతమైన దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం వంటి భయంకరమైన లక్షణాలను అనుభవించాడని వైద్యులు తెలిపారు. టెక్కీ కుటుంబీకులు వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ, వైద్యులు అతన్ని ఎమర్జెన్సీ వార్డులో చేర్చారు. తరువాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో పూర్తి 24 గంటలపాటు ఉంచారు. అతను సొంతంగా శ్వాస తీసుకోగలిగిన తర్వాత అతను డిశ్చార్జ్ అయ్యాడు. వైద్యులు అతనికి తీవ్రమైన అలెర్జీ ఉర్టికేరియా, తీవ్రమైన ఆంజియోడెమా, అనాఫిలాక్సిస్ రియాక్షన్స్ తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు.
దాదాపు 20 రోజుల తర్వాత, పుస్తకాలు శుభ్రం చేస్తూ ఇంట్లో చీమలు ఆ వ్యక్తిని మళ్లీ కుట్టాయి. ఈ సమయంలోమళ్లీ కుటుంబంలో భయం మొదలైంది. హైదరాబాద్‌లోని అశ్విని అలర్జీ సెంటర్‌కు తీసుకొచ్చారు. నిపుణులైన అలెర్జిస్ట్, ఇమ్యునాలజిస్ట్ అయిన డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ రోగి లక్షణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అలెర్జీ స్కిన్ ప్రిక్ టెస్ట్‌ను నిర్వహించారు. రోగి సాధారణ అలర్జీ కారకాలకు సానుకూల ప్రతిస్పందనను ప్రదర్శించకపోవడంతో డాక్టర్ నాగేశ్వర్ రోగి గత అనుభవాలను, లక్షణాలను పరిగణనలోకి తీసుకుని "రెడ్ యాంట్స్ - బ్లాక్ యాంట్స్" అలర్జీ పరీక్షను నిర్వహించారు. పరీక్ష ఫలితాలను పరిగణనలోకి తీసుకొని, రోగికి అత్యాధునిక అలెర్జీ నిర్దిష్ట వెనమ్ ఇమ్యునోథెరపీ చికిత్స అందించారు.
ఓరల్ గా లేదా ఇంజెక్షన్ ద్వారా తీసుకునే మందులు తాత్కాలికంగా మాత్రమే రోగులకు ప్రయోజనం చేకూరుస్తాయి, కానీ అలెర్జీ ప్రేరిత తీవ్రమైన ప్రతిచర్యల నుండి వారిని రక్షించలేకపోవచ్చు. అలర్జీ ఉన్న పేటెంట్.. రోగనిరోధక చికిత్సకు సిద్ధమవ్వాలి. భవిష్యత్తులో ప్రాణాంతకమైన తీవ్రమైన అలెర్జీ నుండి నివారించవచ్చు. అనుకోకుండా అలాంటి కీటకాల దాడులు జరిగితే బయటపడడానికి సరైన చర్యలు తీసుకోవాలని డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ చెప్పారు.
Next Story