Vitamin D: మీకు విటమిన్-డి లోపం ఉందా? ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకోండి
శరీరానికి విటమిన్ -D అనేది చాలా ముఖ్యం. ఇది లోపిస్తే రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అందుకే వైద్యులు మిటమిన్స్
శరీరానికి విటమిన్ -D అనేది చాలా ముఖ్యం. ఇది లోపిస్తే రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అందుకే వైద్యులు మిటమిన్స్ ఉన్న పదార్థాలను తీసుకోవాలని పదేపదే సూచిస్తుంటారు. కానీ చాలా మంది ఇలాంటి విషయాలను పెడచెవిన పెడుతుంటారు. విటమిన్-డి అనేది శరీరానికి అవసరమైన పోషకం. ఈ పోషకాల లోపం ఎముకలు, దంతాల సమస్యలకు కూడా దారితీస్తుంది. విటమిన్ డి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు ఎముకలు, దంతాల సాధారణ అభివృద్ధికి సహాయపడుతుంది. ఈ పోషకాహార లోపం కొన్నిసార్లు నిరాశకు దారితీస్తుంది.
విటమిన్-డి ప్రధాన మూలం సూర్యకాంతి:
విటమిన్ డి ప్రధాన మూలం సూర్యకాంతి. కానీ శీతాకాలంలో సూర్యుడు తక్కువగా ప్రకాశిస్తాడు. సూర్యరశ్మి చలికాలంలో పెద్దగా ఉండదు. అలాంటి సమయంలో శరీరంలో విటమిన్ డి లోపాన్ని భర్తీ చేయడానికి ఎక్కువ పాలు, గుడ్లు తీసుకోవడం ముఖ్యం. శరీరంలో విటమిన్ డి లోపాన్ని సప్లిమెంట్లతో పాటు ఆహారం ద్వారా కూడా తీర్చవచ్చు. కొన్ని సందర్భాల్లో, మీరు డ్రై ఫ్రూట్స్ తినడం ద్వారా విటమిన్ డి లోపాన్ని భర్తీ చేయవచ్చు. ఎలాంటి పండ్లు తినాలి? ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.
ఎండిన అత్తి పండ్లు:
ఎండిన అత్తి పండ్లను తినడం వల్ల శరీరంలో విటమిన్ డి లోపాన్ని పూరించవచ్చు. అయితే వీటిని మితంగా తినాలి. ఇందులో కాల్షియం, పొటాషియం కూడా ఉన్నాయి. ఇది ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఎండిన ఆప్రికాట్లు ఏదైనా పండ్ల దుకాణంలో సులభంగా దొరుకుతాయి. విటమిన్ డితో పాటు, మీరు విటమిన్ ఎ, పొటాషియం, ఫైబర్ కూడా పొందవచ్చు. రోజూ ఒక ఎండు నేరేడు పండు తింటే శరీరం దృఢంగా ఉంటుంది.
ఖర్జూరంలో విటమిన్-డి
విటమిన్ సి, విటమిన్ డి రెండూ ఖర్జూరంలో ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం 4 ఖర్జూరాలు తినడం ద్వారా మీరు ఇన్ఫెక్షన్ నుండి దూరంగా ఉండవచ్చు. అలాగే చలికాలంలో మీ చర్మం మెరిసిపోతుంది. ఎండుద్రాక్షలో విటమిన్ డి, కాల్షియం, ఫాస్పరస్ ఉంటాయి. ఐరన్, ఫైబర్ కూడా అందిస్తుంది. చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎండుద్రాక్ష ప్రత్యేక పాత్ర పోషిస్తుంది.