Daily Walk: ప్రతి రోజు 30 నిమిషాలు నడవండి.. అద్భుతమైన ప్రయోజనాలు
Daily Walk: ఈ రోజుల్లో రకరకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా చాలా మంది బరువు పెరిగిపోతుంటారు.
Daily Walk: ఈ రోజుల్లో రకరకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా చాలా మంది బరువు పెరిగిపోతుంటారు. బరువు తగ్గించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ పెద్దగా ఫలితాలు ఉండవు. బరువు తగ్గించుకునేందుకు రకరకాల కసరత్తులు, మందులు వాడుతుంటారు. ఇక బెల్లీ ఫ్యాట్ అనేది ఈరోజుల్లో సర్వసాధారణమైపోయింది. బెల్లీ ఫ్యాట్ అనేది అనారోగ్యకరమైన జీవనశైలిగా చెప్పవచ్చు. ఇది తగ్గించుకునేందుకు రోజూ 30 నిమిషాలు నడిస్తే చాలంటున్నారు నిపుణులు.
గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్ 2 మధుమేహం, కొన్ని క్యాన్సర్లు, చిత్తవైకల్యం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు అధిక పొట్ట కొవ్వు కూడా ప్రధాన కారణమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. బెల్లీ ఫ్యాట్ పోగొట్టుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని, కొవ్వును తగ్గించడానికి అనేక మార్గాలలో వాకింగ్ అనేది సులభమైన పద్దతి. కానీ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకునేందుకు ప్రతి రోజు ఎంతసేపు నడవాలో ఎవ్వరికి కూడా కచ్చితమైన సమాచారం తెలియదు.
ప్రతిరోజూ కేవలం 30 నిమిషాలు నడవడం వల్ల పొట్ట కొవ్వు తగ్గుతుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఇది బరువు తగ్గడంతోపాటుగా అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటున్నారు నిపుణులు. ఈ విధంగా ప్రతి రోజు వాకింగ్ వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందంటున్నారు. ఈ నడక అనేది కేలరీలను బర్న్ చేస్తుంది. దీని వల్ల శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. మీ నడక ఆధారంగా గంటకు 150 నుండి 300 కేలరీలు బర్న్ చేయవచ్చు అంటున్నారు పరిశోధకులు. ఎక్కువ నడిచినప్పుడు, మీ శరీరం మరింత సమర్థవంతంగా మారుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలు బర్న్ చేయగలదు.
గుండె ఆరోగ్యం:
కేలరీలను బర్న్ చేయడంతో పాటు నడక మీ ఆరోగ్యానికి సంబంధించిన అనేక అంశాలను మెరుగుపరుస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. బరువు నిర్వహణలో సహాయపడుతుంది. మానసిక స్థితిని మెరుగుపరచడంలో, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది.
హృదయ స్పందన రేటు పెంచడానికి..
మీ హృదయ స్పందన రేటును పెంచడానికి, కేలరీలను బర్న్ చేయడానికి నడక అద్భుతమైన మార్గమంటున్నారు. రోజూ 30 నిమిషాలు మితమైన వేగంతో నడవడం వల్ల 150 కేలరీలు బర్న్ అవుతాయి. ది ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబేసిటీలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీలు క్రమం తప్పకుండా నడవడం వల్ల వారి పొత్తికడుపు కొవ్వు నిల్వలు తగ్గుతాయి. రోజు నడవడం వల్ల మీ పొత్తికడుపు కండరాలను బిగించి, ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీ బరువు తగ్గించే లక్ష్యాలను చేరుకోవడానికి రోజూ నడవండి.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.