నిపా వైరస్ అంటే ఏమిటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి?
నిపా వైరస్ కోవిడ్ మహమ్మారికంటే ప్రమాదకరమైనదని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) చెబుతోంది. కరోనా మహమ్మారితో..
నిపా వైరస్ కోవిడ్ మహమ్మారికంటే ప్రమాదకరమైనదని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) చెబుతోంది. కరోనా మహమ్మారితో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న జనాలకు కొత్త కొత్త వైరస్లు వచ్చి మరిన్ని ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక తాజాగా నిపా వైరస్ మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ సోకిన వారిలో మరణాల రేటు 40 నుంచి 70 శాతం ఉంటుందని, కోవిడ్ మరణాల రేటు 3 శాతం లోపే ఉంటుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ వైరస్ కేరళలో సోకగా, దీని కారణంగా ఇద్దరు మరణించినట్లు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ధ్రువీకరించింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అలర్ట్ ప్రకటించింది. అక్కడి పాఠశాలలకు ఈనెల 24వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. కేరళలోని కోజికోడ్ జిల్లాలో ఆగస్టు 30వ తేదీన ఒకరు, ఈ నెల మొదట్లో మరొకరు నిపా వైరస్‌తో చనిపోయినట్లు అధికారులు చెప్పారు. 2018 నుంచి ఇప్పటివరకు కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ కేసులు వెలుగు చూడటం ఇది నాలుగోసారి. అయితే కేరళలో పరిస్థితి తీవ్రతను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ బృందాన్ని కేరళకు పంపినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. వైరస్‌ను కట్టడి చేయడంలో కేరళ ప్రభుత్వానికి అవసరమైన సాయం చేస్తామని అన్నారు.
నిపా వైరస్ అంటే ఏమిటి?
నిపా వైరస్ ఎలా సోకుతుంది? లక్షణాలు ఏమిటి..?
☛ వ్యాధి సోకిన వారికి, ప్రారంభ లక్షణాలు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, గొంతు నొప్పి. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, మెదడువాపు, మూర్ఛలు.
☛ వైరస్ సోకిన వారిలో కొన్ని సందర్భాల్లో వైరస్ లక్షణాలు కనిపించవు. కొంతమందిలో మాత్రం శ్వాస సంబంధిత సమస్యలు ఉంటాయి. అంతేకాకుండా ఈ వైరస్ మెదడుపై తీవ్ర ప్రభావం ఉంటుంది.
☛ ఈ వైరస్‌కు సరైన చికిత్స, వ్యాక్సీన్ ఇంకా అందుబాటులోకి రాకపోవడం వలన వైరస్ సోకిన వారిలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండవచ్చు. లక్షణాలు గుర్తించిన తర్వాత చికిత్స అందించాలి.