Tue Nov 05 2024 19:48:10 GMT+0000 (Coordinated Universal Time)
ఈ బ్లడ్ గ్రూపులు ఉన్నవారికి గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువ
మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, మీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోండి. గుండె మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవం..
మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, మీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోండి. గుండె మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవం. ప్రస్తుతం చెడు జీవనశైలి వల్ల చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. వృద్ధుల్లోనే కాకుండా యువతలో కూడా గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. గుండె జబ్బుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ రోజుల్లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరికి గుండెపోటు, గుండె సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. జీవనశైలిలో మార్పుల వల్ల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాము. ఈ మధ్య కాలం నుంచి చాలా మంది గుండె పోటుతో మృతి చెందే వారు చాలా మంది ఉంటున్నారు.
గుండె సంబంధిత వ్యాధులు జీవనశైలి లేదా జన్యుశాస్త్రంపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. అయితే కొన్నిసార్లు బ్లడ్ గ్రూప్ కూడా కారణం కావచ్చు. బ్లడ్ గ్రూప్ కారణంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఏ బ్లడ్ గ్రూప్‌లో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందో తెలుసుకుందాం.
పరిశోధనలో ఏం తేలింది
బ్లడ్ గ్రూప్, గుండె సంబంధిత వ్యాధులపై నిర్వహించిన పరిశోధనలో కొన్ని బ్లడ్ గ్రూప్‌లు ఉన్నవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. పరిశోధన ప్రకారం.. A, B బ్లడ్ గ్రూప్‌ల వ్యక్తులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు బ్లడ్ గ్రూపులు ఉన్నవారికి రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలలో తేలినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ బ్లడ్ గ్రూపులు ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం. ఇతర గ్రూపుల వారికంటే ఈ గ్రూపుల వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.
ఏ వ్యక్తులు తక్కువ ప్రమాదంలో ఉన్నారు?
ఇందుకు సంబంధించి దాదాపు 4 లక్షల మందిపై జరిపిన పరిశోధనలో ఓ బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో గుండె సంబంధిత వ్యాధులు తక్కువగా ఉన్నట్లు తేలిందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బులు తక్కువగా ఉంటాయి. ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్ ప్రమాదం 10 శాతం తగ్గింది.
ఆరోగ్యకరమైన జీవనశైలి
గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం తప్పనిసరి అంటున్నారు. అందుకని హెల్తీ డైట్ తీసుకోవడంతో పాటు వర్కవుట్స్ చేయడం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడున్న కాలంలో గుండె జబ్బులతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతోంది. అందుకే గుండెను జాగ్రత్తగా ఉంచుకోవాలని, చిన్నపాటి లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యున్ని సంప్రదించాలంటున్నారు.
Next Story