రాత్రి భోజనం చేసిన ఎన్ని గంటలకు ఉదయం అల్పాహారం తీసుకోవాలి?
ఈ రోజుల్లో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పుడున్న రోజుల్లో జీవనశైలి, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి..
ఈ రోజుల్లో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పుడున్న రోజుల్లో జీవనశైలి, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, ఒత్తిడి తదితర కారణాల వల్ల ఆరోగ్యం బారిన పడుతున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు సరైన ఆహార పదార్థాలను తీసుకోవడం ఉత్తమం. ఇప్పుడు ఆల్పహారం గురించి తెలుసుకుందాం. అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన భోజనంగా పరిగణిస్తుంటాము. ఉదయం పూట ఖాళీ కడుపుతో ఎక్కువసేపు ఉండకూడదని ఇంటి పెద్దల నుంచి ఆరోగ్య నిపుణులు, వైద్యులు, డైటీషియన్ల వరకు అందరూ నమ్ముతారు. దీని వెనుక చాలా లాజిక్లు ఉన్నాయి. మీరు రోజులో మొదట భోజనం తీసుకోండి. ఈ మొదటి భోజనం పోషకాలు, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉండాలి. అప్పుడే శరీరానికి సరైన పోషకాలు అందుతాయని వైద్య నిపుణులు చెబుతున్నమాట.
మీరు పోషకాలు అధికంగా ఉండే అల్పాహారాన్ని తీసుకుంటే, మీ జీవక్రియ వేగవంతం అవుతుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయి కూడా అదుపులో ఉంటుంది. మీరు రోజంతా శక్తివంతంగా ఉంటారు. ఏకాగ్రతతో పని చేస్తారు. అంతే కాదండోయ్.. ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడంలో కూడా ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. నేడు చాలా మంది తమ బరువును తగ్గించుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు.
అల్పాహారం తీసుకోకపోవడం వల్ల కలిగే సమస్యలు:
అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మీరు అల్పాహారం కోసం ఏమి తింటారు? జర్నల్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజంలో ప్రచురించిన నివేదిక ప్రకారం.. ఎప్పుడైనా అల్పాహారం తీసుకోవడం శరీరానికి మంచిది కాదు. ఇది మీ కడుపు లేదా జీర్ణక్రియ ప్రక్రియలో ఆటంకాలు కలిగించవచ్చు. అజీర్ణం లేదా జీర్ణ ప్రక్రియలో ఆటంకాలు ఏర్పడవచ్చు.ఈ సందర్భంలో శరీరంలోని ఇన్సులిన్లో ఆటంకం ఏర్పడుతుంది. డైస్లిపిడెమియా బలహీనమైన గ్లూకోజ్, మెటబాలిక్ సిండ్రోమ్, టైప్ 2 మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, ఊబకాయం సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.
రాత్రి భోజనం చేసిన ఎన్ని గంటలకు ఉదయం అల్పాహారం తీసుకోవాలి?
అంతకుముందు సాయంత్రం, రాత్రి మీరు డిన్నర్ చేసిన 12 గంటల తర్వాత అల్పాహారం తీసుకోవడానికి ఉత్తమ సమయమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది అందరికీ పని చేస్తుంది. 12 గంటల ఉపవాసం చాలా మందికి బాగా సరిపోతుంది. నిద్ర, ఉపవాసం ద్వారా శరీరానికి చాలా కాలం విశ్రాంతి లభిస్తుంది. ఉపవాస వ్యవధిని 14 లేదా 16 లేదా 18 గంటలకు పొడిగించవచ్చా? అనేది పూర్తిగా మీ శరీర రకం, ప్రతిస్పందనపై ఆధారపడి ఉంటుంది. 16 గంటల ఉపవాసం ప్రతి ఒక్కరికీ అవసరం లేదు. అయితే 14 గంటల ఉపవాసం పెద్ద సంఖ్యలో ప్రజలకు స్థిరంగా, ప్రయోజనకరంగా అనిపించవచ్చు. మీ శరీరం ప్రతిస్పందనపై శ్రద్ధ వహించండి. శరీరానికి, మనసుకు మేలు చేస్తుంది.
అల్పాహారం మానేయడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందా?
'జర్నల్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డెవలప్మెంట్ అండ్ డిసీజ్'లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం.. అమెరికా, జపాన్ నుంచి ప్రచురించబడిన కొన్ని డేటా ఈ నివేదికలో వెల్లడించింది. అల్పాహారం మానేస్తే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని తేలింది. అది మీ మరణానికి కూడా కారణం కావచ్చు. కానీ అల్పాహారం అంటే మార్కెట్ నుంచి ఏదైనా కొని తినాలని కాదు. అల్పాహారంలో గుడ్లు, జున్ను, టోస్ట్ లేదా పండ్లతో కూడిన ఓట్ మీల్, ఒక గ్లాసు ఆవు లేదా బాదం పాలు ఉండాలి. మీరు 1/2 కప్పు సాంబార్, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి చట్నీని రెండు దాల్ దోసలతో కూడా తినవచ్చు. ఇందులోని అంశాలు నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందిస్తున్నాము. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.