Fri Nov 22 2024 19:30:04 GMT+0000 (Coordinated Universal Time)
Holi 2023 : ఇదెక్కడి వింత ఆచారం బాబూ ! భర్తలను వెంటాడి తన్నిన భార్యలు
వాటిలో భాగంగా.. 'లత్మార్ హోలీ' (Lathmar Holi) పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ ఆచారం కొంచెం వింతగానే..
ఉత్తరప్రదేశ్ లో హోలీ పండుగ సందర్భంగా ఓ వింత ఆచారాన్ని పాటిస్తారు. సాధారణంగా అక్కడ 25 రోజుల పాటు హోలీ వేడుకలను జరుపుకుంటారు. వాటిలో భాగంగా.. 'లత్మార్ హోలీ' (Lathmar Holi) పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ ఆచారం కొంచెం వింతగానే ఉంటుంది. మగాళ్లను ఆడవాళ్లు కర్రలతో కొడతూ ఉంటే.. భర్తలు ఆ దెబ్బల నుంచి తప్పించుకోవాలి. ఈ ఆచారం తరతరాలుగా అక్కడి స్త్రీలు పాటిస్తున్నారు. మంగళవారం (ఫిబ్రవరి 28) లత్మార్ హోలీ వేడుకను బర్సానాలో నిర్వహించారు.
రాధాకృష్ణులను స్వచ్ఛమైన ప్రేమకు ఉదాహరణగా భావిస్తారని తెలిసిందే. వారిప్రేమకు చిహ్నంగానే లత్మార్ హోలీ'లో ఆడవాళ్లు సరదాగా మగవారిని కర్రలతో కొడతారు. ఆ సమయంలో మగవారు వివిధ వస్తువులను అడ్డుపెట్టుకుని తమను తాము కాపాడుకోవాలి. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
Next Story