Fri Nov 22 2024 14:08:16 GMT+0000 (Coordinated Universal Time)
హోలీ సందర్భంగా స్విగ్గీ యాడ్.. నెటిజన్ల ఆగ్రహం
హోలీ సందర్భంగా స్విగ్గీ రూపొందించిన యాడ్ లో.. చుట్టూ హోలీ రంగులు, మధ్యలో కోడిగుడ్లు ఉన్నాయి. ‘గుడ్లను ఆమ్లెట్..
ఒక్కొక్కసారి చిన్న చిన్న పొరపాట్లు కూడా పెద్ద వివాదానికి దారితీస్తాయి. ఏదో కొత్తగా చేయాలనుకుంటే.. అది చిరిగి చాటంతై చాపంత అవుతుందని ఊరికే అనలేదు మరి. ఇప్పుడు స్విగ్గీ పరిస్థితి అలానే ఉంది. ‘హోలీ’ (2023) పండుగ సందర్భంగా ఫుడ్ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’ఇచ్చిన ఓ ప్రకటన.. వివాదాస్పదమైంది. హోలీ అంటే.. రంగులు చల్లుకోవడంతో పాటు గుడ్లు, టొమాటోలతో కూడా ఒకరినొకరు కొట్టుకుంటారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. గుడ్లను కొట్టుకోడానికి కాకుండా.. తినడానికి వాడాలంటూ స్విగ్గీ పెద్ద హోర్డింగ్ తో ప్రకటన చేసింది. ఇదే దాని కొంపముంచింది.
ఫుడ్ డెలివరీతో పాటు నిత్యావసర వస్తువుల్నికూడా ఇన్‌స్టామార్ట్ పేరిట నిత్యావసర వస్తువులనూ స్విగ్గీ డెలివరీ చేస్తోంది. హోలీ సందర్భంగా స్విగ్గీ రూపొందించిన యాడ్ లో.. చుట్టూ హోలీ రంగులు, మధ్యలో కోడిగుడ్లు ఉన్నాయి. ‘గుడ్లను ఆమ్లెట్ వేసుకోవడానికి వినియోగించండి.. కానీ ఎవరి తలమీదా కొట్టడానికి కాదు’ అని అర్థం వచ్చేలా ఆ యాడ్ ఉంది. హోలీకి సంబంధించిన సరకులను ఇన్‌స్టామార్ట్‌లో తెప్పించుకోండి అని చెబుతునే గుడ్లను తలమీద కొట్టటానికి కూడా ఆమ్లెట్లు వేసుకోండి అంటూ సూచించింది. దీనికి #BuraMatKhelo అనే హ్యాష్‌ట్యాగ్‌ను యాడ్ చేసింది. ఢిల్లీ-ఎన్సీఆర్లో ఏర్పాటు చేసిన ఈ యాడ్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో #HinduphobicSwiggy అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు వెల్లువెత్తాయి. స్విగ్గీని బాయ్‌కాట్ చేయాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. కొన్ని హిందూ సంఘాలు ఈ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. స్విగ్గీని బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఒక్కసారిగా నిరసనలు వెల్లువెత్తడంతో స్విగ్గీ ఆ యాడ్ ను తొలగించింది.
Next Story