Mon Dec 23 2024 13:05:23 GMT+0000 (Coordinated Universal Time)
లీకైన అమ్మోనియా.. 15 మందికి అస్వస్థత
కాలనీలోని పైప్ లైన్ రోడ్డు చివర ఉండే చెత్తకుప్పల్లో చాలాకాలంగా రెండు అమ్మోనియా గ్యాస్ సిలిండర్లు నిరుపయోగంగా ఉన్నాయి
హైదరాబాద్ ఫతేనగర్ లో సిలిండర్ల నుంచి అమ్మోనియా గ్యాస్ లీకవ్వడంతో 15 మంది అస్వస్థతకు గురయ్యారు. కాలనీలోని పైప్ లైన్ రోడ్డు చివర ఉండే చెత్తకుప్పల్లో చాలాకాలంగా రెండు అమ్మోనియా గ్యాస్ సిలిండర్లు నిరుపయోగంగా ఉన్నాయి. వాటిని గమనించిన ఓ దొంగ.. సిలిండర్లకు ఉన్న ఇత్తడి వాల్స్ ను తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వాటిని రాడ్డుతో కొట్టి తొలగించబోయాడు. రాడ్డుతో వాల్స్ ను కొట్టడంతో.. అవి ఊడిపోయి సిలిండర్ నుంచి పెద్దఎత్తున అమ్మోనియా గ్యాస్ లీకైంది.
ఎవరైనా చూస్తే.. తనను పోలీసులకు అప్పగిస్తారని భయపడిన అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. సిలిండర్ నుంచి 15 మీటర్లకు పైగా గాలిలో అమ్మోనియా వ్యాపించడంతో.. ఆ పక్కనే ఉన్న ఓ కంపెనీలో పనిచేస్తున్న 10 మంది బీహార్ కు చెందిన కార్మికులు, ఐదుగురు కాలనీవాసులు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని 15 మందిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెత్త వేసే ప్రాంతంలో ఆ సిలిండర్లు ఎవరు ఉంచారన్న విషయంపై ఆరా తీస్తున్నారు.
Next Story