Mon Dec 23 2024 08:11:35 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో 26 సంవత్సరాల వ్యక్తి ప్రాణం తీసిన స్విమ్మింగ్ పూల్
క్రికెట్ ఆడారు.. ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ కు వెళ్లారు
హైదరాబాద్ లో స్విమ్మింగ్ పూల్ లో మునిగిపోయి 26 సంవత్సరాల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. జహనుమాకు చెందిన 26 ఏళ్ల యువకుడు ఆదివారం చాంద్రాయణగుట్టలోని స్విమ్మింగ్ పూల్ లో మునిగిపోయాడు. సయ్యద్ సమీయుద్దీన్ (26) ఉదయం ఖిల్వత్ వద్ద తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. అక్కడి స్థానిక మైదానంలో క్రికెట్ ఆడిన అనంతరం తన స్నేహితులతో కలిసి చాంద్రాయణగుట్టలోని ముంతాజ్బాగ్లో ఉన్న ఓ ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్కు వెళ్లాడు.
స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ ఉండగా.. అతడు ఒక్కసారిగా మునిగిపోవడం జరిగింది. సమీయుద్దీన్ నీటిలో మునిగిపోవడంతో అతడి స్నేహితులు, సిబ్బంది అక్కడికి చేరుకుని బయటకు తీసుకొచ్చారు. అతడిని ఒవైసీ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సమీయుద్దీన్ సోదరుడు సయ్యద్ అహ్మదుద్దీన్ స్విమ్మింగ్ పూల్ నిర్వాహకుల నిర్లక్ష్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతూ ఉంది.
Next Story