Mon Dec 23 2024 11:39:58 GMT+0000 (Coordinated Universal Time)
అక్కడ గణేష్ లడ్డూ ధర రూ.60.80 లక్షలు
హైదరాబాద్ లోని సన్సిటీలోని రిచ్మండ్ విల్లాస్ లో గణేష్ లడ్డూ 60.80 లక్షల ధర పలికింది
బాలాపూర్ లడ్డూ ధరను మించి వేలం హైదరాబాద్ లో జరిగింది. హైదరాబాద్ లోని సన్సిటీలోని రిచ్మండ్ విల్లాస్ లో గణేష్ లడ్డూ 60.80 లక్షల ధర పలికింది. వేలంలో సరికొత్త రికార్డును సృష్టించింది. బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం తర్వాత అల్వాల్ లో నిన్న జరిగినవేలంలో 46 లక్షల ధర పలికింది.
రికార్డును బ్రేక్ చేస్తూ...
ఆ రికార్డును బ్రేక్ చేస్తూ ఇప్పుడు సన్‌సిటీలో 60.80 లక్షల రూపాయల ధర పలికింది. దీంతో ఇప్పటి వరకూ గణేష్ లడ్డూ వేలంలో ఉన్న రికార్డులన్నీ తుడుచుపెట్టుుపోయాయి. ఈ లడ్డూను ఆర్వీ దియా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేలం జరిగింది. ఈ వేలంలో అత్యధిక ధరకు లడ్డూ వేలంలో పాడుకోవడం రికార్డు నెలకొల్పింది. తెలుగు రాష్ట్రాల్లో ఇదే గణేష్ లడ్డూల వేలంలో అత్యధిక ధర పలికిందనే చెప్పాలి.
Next Story