Mon Dec 23 2024 08:52:49 GMT+0000 (Coordinated Universal Time)
వీధికుక్కల దాడిలో బాలుడి మృతి
వీధికుక్కుల దాడిలో ఒక బాలుడు మృతి చెందాడు. హైదరాబాద్ అంబర్పేట్ లో ఈ విషాదం చోటు చేసుకుంది
వీధికుక్కల దాడిలో ఒక బాలుడు మృతి చెందాడు. హైదరాబాద్ అంబర్పేట్ లో ఈ విషాదం చోటు చేసుకుంది. వీధిలో ఆడుకుంటుండగా ఈ వీధికుక్కులు బాలుడు ప్రదీప్ పై దాడి చేశాయి. ఈ దాడిలో ప్రదీప్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించే లోపే ప్రదీప్ మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో ఈ ఘటన విషాదాన్ని నింపింది
అధికారులకు ఫిర్యాదు చేసినా...
అయితే తమ వీధిలో కుక్కల బెడద ఉందని స్థానికులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెబుతున్నారు. వీధికుక్కలు స్వైర విహారం చేస్తున్నా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపై జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, బాలుడి కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story