Mon Dec 23 2024 17:21:24 GMT+0000 (Coordinated Universal Time)
ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం... భయంతో పరుగులు తీసిన రోగులు
కేపీహెచ్బీ పోలీసు స్టేషన్ పరిధిలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
కేపీహెచ్బీ పోలీసు స్టేషన్ పరిధిలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో చికిత్స పొందుతున్న రోగులు భయాందోళనలకు గురయ్యారు. ఆసుపత్రి నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే షార్ట్ సర్క్యూట్ తోనే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుుడు ఆసుపత్రిలో నలభై మంది వరకూ రోగులు ఉన్నారని సమాచారం.
నిజాంపేట్ లోని....
నిజాంపేట్ లోని హోలిస్టిక్ ఆసుపత్రిలోని మైన్ వన్ భవనంలోని ప్యానల్ బోర్టులో తొలుత మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణమని చెబుతున్నారు. పొగలు రావడంతో సిబ్బంది, రోగులు ప్రాణభయంతో పరుగులు తీశారు. సమాచారం స్థానికులు అందించడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. అత్యవసర చికిత్స పొందుతున్న రోగులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Next Story