Mon Dec 23 2024 13:00:24 GMT+0000 (Coordinated Universal Time)
పీడీ యాక్ట్ పై నేడు విచారణ
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పై వాదనలు జరుగుతున్నాయి. రాజాసింగ్ తరుపున న్యాయవాది వాదనలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈరోజు మరోసారి ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ తమ వాదనలను వినిపించనున్నారు.
బోర్డు మాత్రం...
రాజాసింగ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఆయనకు బెయిల్ రావాలంటే పీడీ యాక్టు గురించి తేలాల్సి ఉంటుంది. పీడీ యాక్ట్ పై అడ్వయిజరీ బోర్డు కూడా ఆయనపై పీడీ యాక్ట్ ను పెట్టడాన్ని సమర్థించింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో ఈ కేసులో ఎలాంటి తీర్పు రానుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
Next Story