Mon Dec 15 2025 00:10:36 GMT+0000 (Coordinated Universal Time)
మోదీ హైదరాబాద్ పర్యటన.. ఒకరి అరెస్ట్
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో హైదరాబాద్ పాతబస్తీలో హై అలెర్ట్ ప్రకటించారు

Hyderabad : ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో హైదరాబాద్ పాతబస్తీలో హై అలెర్ట్ ప్రకటించారు. ఇప్పటికే పాతబస్తీకి చెందిన మాజిద్ అట్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆల్ ఇండియా మజిల్స్ ఇంక్విలాబ్ కు చెందిన నేషనల్ కన్వీనర్ గా అట్టర్ వ్యవహరిస్తున్నారు. నుపురు శర్మ ఘటనపై అట్టర్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.
ఫేస్బుక్ లో పోస్ట్ చేసి....
ఆర్ఎస్ఎస్, బీజేపీ వెంటనే క్షమాపణల చెప్పాలని అట్టర్ తన ఫేస్ బుక్ పోస్టులో పెట్టారు. క్షమాపణలు చెప్పకుంటే నిరసనలు తప్పవని ఆయన హెచ్చరించారు. నిరసనలను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని అట్టర్ పిలుపునిచ్చారు. దీంతో మొఘల్‌పుర పోలీసులు అట్టర్ ను అరెస్ట్ చేశారు. దీంతో పాటు ఉదయ్‌పూర్ ఘటనపై హైదరాబాద్ లో సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు నిఘా ఉంచారు. భద్రతను మరింత పెంచాలని నిర్ణయించారు.
Next Story

