Sat Dec 21 2024 12:28:44 GMT+0000 (Coordinated Universal Time)
మొన్న సూర్యపేటలో.. నేడు అత్తాపూర్లో.. పాతకక్షలతో వ్యక్తి హత్య
ఇటీవలే సూర్యాపేటలో ఓ యువకుడిని.. మరో ముగ్గురు యువకులు నడిరోడ్డుపై పట్టపగలే దారుణంగా చంపిన ఘటన మరువకుండానే..
తెలంగాణలో పాతకక్షలు పురివిప్పుతున్నాయి. గతంలో ఉన్న కక్షల నేపథ్యంలో.. పలువురు వ్యక్తులు హత్యలకు గురవుతున్నారు. ఇటీవలే సూర్యాపేటలో ఓ యువకుడిని.. మరో ముగ్గురు యువకులు నడిరోడ్డుపై పట్టపగలే దారుణంగా చంపిన ఘటన మరువకుండానే.. అత్తాపూర్ లో పాతకక్షల నేపథ్యంలో మరో వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఆదివారం తెల్లవారుజామున ఖలీల్ అనే వ్యక్తిని దారుణంగా చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి వెళ్లి.. పరిస్థితిని పరిశీలించారు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
పహాడీ షరీఫ్ ప్రాంతానికి చెందిన ఉస్మాన్ కు .. ఖలీల్ కు కొంతకాలంగా గొడవలున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉస్మానే ఖలీల్ ను చంపినట్లు పోలీసులు తెలిపారు. ఉస్మాన్ రౌడీ షీటర్ అని వెల్లడించారు. ఖలీల్ మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్తాపూర్ లో అర్థరాత్రి సమయంలో.. చింతల్ మెట్ వద్ద ఖలీల్ ఉల్లా అనే యువకుడిని కత్తులతో పొడిచి, అతి దారుణంగా చంపినట్లు పోలీసులు వివరించారు. అయితే ఖలీల్ ఆ సమయంలో అక్కడికి ఎందుకు , ఎవరి కోసం వచ్చాడన్న విషయం తెలియాల్సి ఉందన్నారు.
Next Story