Mon Dec 23 2024 06:44:06 GMT+0000 (Coordinated Universal Time)
ఆ హైదరాబాద్ యువకులకు ఐదేళ్ల జైలు శిక్ష
పనిచేసినందుకు ప్రయత్నించిన హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు అబ్దుల్లా బాసిత్
ఐఎస్ఐఎస్తో కలిసి పనిచేసినందుకు ప్రయత్నించిన హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు అబ్దుల్లా బాసిత్, అబ్దుల్ ఖదీర్లకు ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట హఫీజ్ బాబానగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్లా బాసిత్(28), అబ్దుల్ ఖదీర్(23)కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. నగరంలోని చాంద్రాయణగుట్టకు చెందిన వీరిద్దరినీ 2018 ఆగస్టులో నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (NIA) అరెస్టు చేసింది. దేశంలో ఐఈడీతో విధ్వంసాలు సృష్టించేందుకు, యువతను టెర్రరిజం వైపు మళ్లించేందుకు ఐసిస్ కుట్ర చేస్తున్నట్లు అప్పట్లో కేంద్ర హోంశాఖ గుర్తించింది.
హోంశాఖ ఆదేశాలతో 2016, జనవరి 1న ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఐఎస్ సభ్యులైన జమ్మూ కశ్మీర్‌కు చెందిన షేక్ అజర్ అల్ ఇస్లాం సత్తార్, కర్నాటకకు చెందిన అద్నాన్ హుస్సేన్, మహారాష్ట్ర థాణేకు చెందిన మహ్మద్ ఫర్హాన్ షేక్‌లను అదే ఏడాది జనవరి 29న అరెస్ట్ చేసింది. పాకిస్తాన్‌కు చెందిన ఖలీద్ ఖిల్జీ ఆదేశాలతో ముస్లిం యువత రిక్రూట్మెంట్కు పాల్పడుతున్నట్లు గుర్తించింది. ఎన్ఐఏ దర్యాప్తులో హైదరాబాద్ చాంద్రాయణగుట్ట కేంద్రంగా అబ్దుల్లా బాసిత్, ఖదీర్‌లు ఐఎస్‌కు పనిచేస్తున్నట్టు తేలింది. 2018, ఆగస్టు 12న హైదరాబాద్‌లో సోదాలు చేసి ఆ ఇద్దరినీ అరెస్ట్ చేసింది. నిందితుల వద్ద ఐఈడీతో పాటు పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకుంది. 2019, ఫిబ్రవరి 7న వారిపై చార్జిషీట్ దాఖలు చేయగా ఢిల్లీ ఎన్ఐఏ స్పెషల్ కోర్టు విచారణ జరిపి తాజాగా శిక్షలు ఖరారు చేసింది.
Next Story