Thu Dec 19 2024 18:25:04 GMT+0000 (Coordinated Universal Time)
Nikesh Kumar : నిఖేశ్ కుమార్ లాకర్లలో కిలోల కొద్దీ బంగారం
ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ కుమార్ కు చెందిన సన్నిహితుల లాకర్లలో రెండు కిలోల బంగారం ఉన్నట్లు ఏసీబీ అధికారులు కనుగొన్నారు.
ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ కుమార్ కేసులో తవ్వే కొద్దీ ఇంకా అక్రమార్జన బయటపడుతూనే ఉంది. నిఖేష్ కుమార్ కు చెందని సన్నిహితుల లాకర్లలో రెండు కిలోల బంగారం ఉన్నట్లు ఏసీబీ అధికారులు కనుగొన్నారు. ఇటీవల ఏఈఈ నిఖేష్ కుమార్ ఇళ్లతో పాటు వారి సన్నిహితులపై దాడులు చేసిన ఏసీబీ అధికారులకు ఆయన ఆస్తులను చూసి కళ్లు బైర్లు కమ్మాయి. కోట్లాది రూపాయల ఆస్తులను కూడబెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. అక్రమాస్తులను గుర్తించిన ఏసీబీ అధికారులు నిఖేశ్ కుమార్ కు చెందిన, ఆయన సన్నిహితులకు సంబంధించిన బ్యాంకు లాకర్లను కూడా పరిశీలించారు.
మొత్తం పద్దెనిమిది లాకర్లు...
మొత్తం పద్దెనిమిది లాకర్లు ఉన్నట్లు గుర్తించారు. బంగారు ఆభరణాలతో ప్లాటినం, డైమండ్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పద్దెనిమిది లాకర్లలో రెండు మాత్రమే నిఖేష్ కుమార్ పేరు మీద ఉండగా మిగిలిన పదహారు లాకర్లు సన్నిహితులు, బంధువుల పేర్ల మీద ఉన్నాయి. కిలోల కొద్దీ బంగారం ఉండటంతో మరికొన్ని లాకర్లను ఓపెన్ చేయాల్సి ఉందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే నిఖేశ్ కుమార్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపిన అధకారులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. వందల కోట్ల ఆస్తులను కేవలం పదేళ్లలోనే సంపాదించడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతుంది.
Next Story