Sun Jan 12 2025 12:48:40 GMT+0000 (Coordinated Universal Time)
Hydra : ఆదివారం హైడ్రా కూల్చివేతలు ప్రారంభం.. ఈసారి విల్లాలు, భవనాలు
కూల్చివేతలకు కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చిన హైడ్రా తిరిగి ఆదివారం మొదలుపెట్టింది. హైదరాబాద్ నగరంలో భవనాలను కూల్చివేస్తుంది
కూల్చివేతలకు కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన హైడ్రా తిరిగి ఆదివారం మొదలుపెట్టింది. హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ స్థలాలను, బఫర్ జోన్ లో నిర్మించిన భవనాలను కూల్చివేయడం ప్రారంభించింది. తెల్లవారు జాము నుంచే కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. కూకట్పల్లి, అమీన్ పూర్ లో అపార్ట్మెంట్లు,విల్లాలను కూల్చివేస్తుంది. మొత్తం పదకొండు ఎకరాల్లో ఈ ఆక్రమణలున్నట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. కూకట్ పల్లిలో ఏడుఎకరాల్లోనూ. అమీన్ పూర్ లో నాలుగు ఎకరాల్లో అక్రమ నిర్మాణాలను చేపట్టారు. అపార్ట్మెంట్లు, విల్లాలను నిర్మించి కొందరు సొమ్ముచేసుకున్నారు. బఫర్ జోన్ లో ఉన్నందున వాటిని కూల్చివేయడానికి నిర్ణయించినట్లు హైడ్రా అధికారులు విల్లాలకు, అపార్ట్మెంట్లకు నోటీసులు ఇచ్చారు. మొత్తం పదహారు ఎకరాల్లో నిర్మించిన షెడ్లను కూడా కూల్చివేశారు.
తెల్లవారు జాము నుంచే...
వ్యాపార సముదాయాలను కూడా నేలమట్టం చేశారు. ఈరోజు తెల్లవారు జాము నుంచే కూల్చివేతలను ప్రారంభించిన హైడ్రా భారీ పోలీసుల బందోబస్తు మధ్య ప్రారంభించారు. నాలు ఎకరాల్లో యాభై భవనాలు, విల్లాలు కూడా ఉన్నాయి. అమీన్ పూర్ కృష్ణారెడ్డి పేట, పటేల్ నగర్ ప్రాంతంలో ఈ అక్రమణ నిర్మాణాలను చేపట్టారు. కూకటపల్లి నల్ల చెరువును కూడా ఆక్రమించి మరీ విల్లాలను చేపట్టారు. స్థానికులు ఎవరూ అక్కడకు రాకుండా అడ్డుకుంటున్నారు. అమీన్పూర్ లోని ప్రభుత్వ స్థలంలో ముప్ఫయి విల్లాలను కూల్చివేస్తున్నారు. కూల్చివేతలలో ఒక ఆసుపత్రి కూడా ఉందని తెలిసింది. విల్లాలు, అపార్ట్మెంట్లు, భవనాలు ఇలా అనేక రకాలుగా నిర్మాణాలను కూల్చివేతలను హైడ్రా ప్రారంభించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీటిని నిర్మించినట్లు తెలసింది.
Next Story