Mon Dec 30 2024 14:31:17 GMT+0000 (Coordinated Universal Time)
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలయ్ బలయ్
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలబయ్ బలయ్ కార్యక్రమం ప్రారంభమయింది. దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలబయ్ బలయ్ కార్యక్రమం ప్రారంభమయింది. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఢంకా మోగించి అలయ్ బలయ్ ను దత్తన్న ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కళాకారుల నృత్యప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పోతురాజుల నృత్యాలు ఆకర్షణగా నిలిచాయి. తాను హర్యానా గవర్నర్ గా ఉన్నప్పటికీ తాను తెలంగాణ వ్యక్తినేనని దత్తాత్రేయ అన్నారు.
పద్దెనిమిదేళ్లుగా...
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిధిగా వచ్చారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. 2005 నుంచి ఈ కార్యక్రమాన్ని తాను నిర్వహిస్తున్నానని తెలిపారు. ఇది పందొమ్మిది ఏట జరుపుకుంటున్నామని, ఈ కార్యక్రమానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించామని దత్తాత్రేయ తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల నేతలను ఒకే వేదికపైకి తీసుకు వచ్చి అందరినీ ఏకం చేయడం కోసమే అలయ్ బలయ్ కార్యక్రమాన్ని దత్తన్న ఏర్పాటు చేస్తూ వస్తున్నారు.
Next Story