Mon Dec 23 2024 10:43:45 GMT+0000 (Coordinated Universal Time)
రేపే గణేష్ నిమజ్జనం.. అన్ని ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్ లో నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేట్యాంక్బండ్ పై ప్రత్యేక క్రేన్లు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ లో నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు గణేష్ నిమజ్జనం కోసం ట్యాంక్బండ్ పై ప్రత్యేక క్రేన్లు ఏర్పాటు చేశారు. 12 వేలకు పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. క్రేన్ నెంబరు 4వద్ద ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం పూర్తయిన వెంటనే వ్యర్థాల తొలగింపునకు 20 జేసీబీలను ట్యాంక్బండ్ పై అందుబాటులో ఉంచారు. ప్రజలు ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం జరుపుకోవాలని పోలీసులు కోరుతున్నారు.
ప్రశాంతంగా జరిగేందుకు...
హుస్సేన్ సాగర్ చుట్టూ 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలను కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేశారు. అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, విద్యుత్తు, వైద్య శాఖలు సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వేడుకల్లో ఎలాంటి అపశ్రుతి జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. పాతబస్తీలో 2,500 మందితో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story