Fri Nov 08 2024 05:53:27 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Elections : గ్రామానికి బయలుదేరిన ఓటర్లు.. బస్టాండ్లన్నీ కిటకిట
హైదరాబాద్ లోని అన్ని బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. రేపు పోలింగ్ కు తమ గ్రామాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంది
హైదరాబాద్ లోని అన్ని బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. రేపు పోలింగ్ జరగనుండటంతో హైదరాబాద్ నుంచి తమ గ్రామాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా కనపడుతుంది. అన్ని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడిపోతున్నాయి. అనేక ప్రాంతాలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను కూడా ఏర్పాటు చేసింది. అదనపు బస్సులను కూడా అవసరమైతే ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలకు సెలవు ప్రకటించాలని ఎన్నికల కమిషన్ కూడా ఆదేశించిన నేపథ్యంలో తమ సొంత గ్రామాలకు బయలుదేరి వెళుతున్నారు.
హాలిడే కావడంతో...
ఎక్కువ మంది తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. కానీ వారి ఓటు మాత్రం అక్కడే ఉంది. సామూహికంగా ఒకే చోట ఉన్న ఓటర్లను అభ్యర్థులు ప్రత్యేకంగా వాహనాలను పెట్టి తీసుకెళుతున్నా, ఎక్కువ మంది వివిధ ప్రాంతాల్లో ఉండటంతో స్వయంగా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఇమ్లిబన్ బస్ స్టేషన్ తో పాటు జూబ్లీ బస్టాండ్ లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా కనపడుతుంది. రేపు ఉదయం పోలింగ్ కు వెళ్లాల్సి రావడంతో సొంతూళ్లకు బయలుదేరి వెళుతుండటంతో నగరంలో చాలా వరకూ ఖాళీ అయ్యే అవకాశాలున్నాయి.
Next Story