Mon Apr 21 2025 12:39:09 GMT+0000 (Coordinated Universal Time)
నేడు పోలీసుల ఎదుటకు అల్లు అర్జున్
అల్లు అర్జున్ ను ఈరోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు

అల్లు అర్జున్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈరోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు.సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతిచెందటంతో అల్లు అర్జున్పై కేసు నమోదైన విషయం తెలిసిందే.

మరోసారి విచారణకు...
అయితే ఈ కేసులో అల్లు అర్జున్ ను విచారించేందుకు మరోసారి పోలీసులు సిద్ధమయ్యారు. సినిమా హాల్ లో తొక్కిసలాటకు ముందు, తర్వాత జరిగిన పరిణామాలపై ఆయనను విచారించనున్నారు. ఇటీవల ఆయన మీడియా సమావేశం పెట్టడంపై కూడా విచారించే అవకాశాలున్నాయి. అల్లు అర్జున్ ఇప్పటికే తన ప్రమేయం లేదని, తనకు సంఘటన జరిగిందన్న విషయం మరుసటి రోజు ఉదయం వరకూ తెలియదని చెప్పడంతోనే మరోసారి విచారణకు పోలీసులు అల్లుఅర్జున్ ను పిలిచినట్లు తెలిసింది.
Next Story