Mon Dec 23 2024 08:56:35 GMT+0000 (Coordinated Universal Time)
సినీ మ్యాక్స్ లో ప్రమాదం.. 15 మందికి గాయాలు
ఆర్కే సినీ మ్యాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్థులు గాయపడ్డారు.
ఆర్కే సినీ మ్యాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్థులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మ్యాక్స్ లో గాంధీ సినిమా చూసేందుకు విద్యార్థులు వచ్చారు. వీరంతా భారతీయ విద్యాభవన్ కు చెందిన విద్యార్థులు. వీరంతా ఎస్కలేటర్ ఎక్కుతుండగా ప్రమాదం జరిగింది.
ఎస్కలేటర్ స్పీడ్ గా...
ఎస్కలేటర్ స్పీడ్ గా వెళుతుండటంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ సందర్భంగా 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సినిమా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
Next Story