Wed Nov 06 2024 19:32:58 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్ తో ఏపీకి తెగిన బంధం.. ఉమ్మడి రాజధాని ముగిసిన అంశమే
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ తో ఆంధ్రప్రదేశ్ కు ఉన్న సంబంధం తెగిపోయింది
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ తో ఆంధ్రప్రదేశ్ కు ఉన్న సంబంధం తెగిపోయింది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఏపీలో 2016 ప్రాంతాల్లోనే రాజధానిగా అమరావతిని చేసుకుని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ ను విడిచిపెట్టి వెళ్లిపోయారు. చిన్నాచితకా కార్యాలయాలు తప్ప హైదరాబాద్ లో ఎలాంటి ప్రభుత్వ కార్యాలయాలు లేవు. తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆఫీసులను కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వానిదే...
నేటితో ఉమ్మడి రాజధానిగా పదేళ్లు పూర్తి కావడంతో ఆ బంధం తెగిపోయినట్లేనని అన్నారు. ఇక తెలంగాణకు శాశ్వత రాజధానిగా హైదరాబాద్ కొనసాగనుంది. విభజన చట్లం సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాజధానిలో ప్రాంతంలో పౌరుల రక్షణ బాధ్యతను గవర్నర్ కు అప్పటి కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. నేటి నుంచి ఆ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది. ఇక ప్రధానమైన ఉమ్మడి హైకోర్టు ఎప్పుడో పరిష్కారం అయింది. పేరుకు నేటితో ఉమ్మడి రాజధానిగా గడువు ముగుస్తున్నప్పటికీ ఎప్పుడో ఆ బంధం అనధికారికంగా తెగిపోయిందన్నది వాస్తవం.
Next Story