Mon Dec 23 2024 06:14:53 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : సికింద్రాబాద్ లో మరో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్లో మరో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్ లో అగ్ని ప్రమాదం జరిగింది
హైదరాబాద్లో మరో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్ లో అగ్ని ప్రమాదం జరిగింది. స్వప్నలోక్ కాంప్లెక్స్లోని ఏడు, ఎనిమిది అంతస్థుల్లో ఈ మంటలు చెలరేగాయి. నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దట్టమైన పొగలు అలుముకోవడంతో మంటలను అదుపులోకి తేవడానికి అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. మొత్తం ఎనిమిది అంతస్థుల భవనంలో దాదాపు రెండు వందల దుకాణాలున్నాయి.
నాలుగు ఫైర్ ఇంజన్లతో...
ప్రస్తుతం ఏడు, ఎనిమిది అంతస్థుల్లో మంటలు ఎగిసిపడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురై పరుగులు తీస్తున్నారు. ఆ ప్రాంతమంతా ట్రాఫిక్ ను పోలీసులు నిలిపేశారు. అయితే కాంప్లెక్స్లో ఇద్దరు చిక్కుకున్నారని అనుమానిస్తున్నారు. వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మంటల ధాటికి పలు కార్యాలయాల్లో ఫర్నీచర్ దగ్దమయినట్లు సమాచారం. రద్దీ ప్రాంతం కావడంతో పెద్దయెత్తున ప్రజలు గుమికూడారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Next Story