Sun Dec 22 2024 19:18:50 GMT+0000 (Coordinated Universal Time)
అడిషనల్ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి నివాసంలో అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహించింది.
రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి నివాసంలో అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తులన్నాయన్న సమాచారంతో భూపాల్ రెడ్డిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మొత్తం ఐదు చోట్ల ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.
కీలక పత్రాలను...
దాదాపు నలభై కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. బినామీ పేర్లతో ఆస్తులను కూడబెట్టినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా భూపాల్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు పట్టుబడ్డారు. ఓ భూమి లావాదేవీలో అధికారులకు అడ్డంగా దొరికిపోయిన భూపాల్ రెడ్డి పెద్దయెత్తున, నగదు, ఆస్తి పత్రాలను అధికారులు ఆయన వద్ద స్వాధీనం చేసుకున్నారు.
Next Story