Mon Dec 23 2024 02:07:34 GMT+0000 (Coordinated Universal Time)
బడా గణేశుడి నిమజ్జనానికి నేటి నుంచి ఏర్పాట్లు
నేడు ఖైరతాబాద్ గణేశ్ విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించేందుకు ఏర్పాట్లు ప్రారంభించనున్నారు.
నేడు ఖైరతాబాద్ గణేశ్ విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించేందుకు ఏర్పాట్లు ప్రారంభించనున్నారు. ఈరోజు పూజల అనంతరం ఖైరతాబాద్ గణేశుడి విగ్రహాన్ని వాహనంలోకి ఎక్కించేందుకు ఏర్పాట్లు చేస్తారు. రేపు ఉదయం ఆరున్నర గంటలకు ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం కావాల్సి ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు తెలపడంతో ఈ మేరకు నిర్వాహాకులు శోభాయాత్రకు ఏర్పాట్లు నేటి నుంచి చేయనున్నారు.
రేపు శోభాయాత్ర....
రేపు మధ్యాహ్నం ఒకటిన్నర గంటల లలోపు శోభాయాత్ర ముగించి ఖైరతాబాద్ గణేశుడిని ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇందుకోసం అతి పెద్దదైన గణేశుడి విగ్రహాన్ని తరలించేందుకు నిర్వాహకులు ఈరోజు పూజల అనంతరం చేపడతారు. నిన్నటి నుంచే భక్తుల సందర్శనకు అనుమతిని నిరాకరించడంతో నేడు దూరం నుంచే భక్తులు దర్శించుకోవాల్సి ఉంది. రేపు గణేశ్ శోభాయాత్ర ప్రారంభం కానుంది.
Next Story