భాగ్యనగరం లో ముందుగానే మొదలైన క్రిస్మస్ వేడుకలు
విద్య ఉపాధి కోసం గ్రామాల నుండి హైదరాబాద్ లాంటి మాహానగరాలకి వచ్చి ఈ ఉరుకుల పరుగుల జీవితాలలో మన సొంత ఊరుని, ఊరి వాతావరణం తో పెన వేసుకున్న జ్ఞాపకాలను మనతో పెరిగిన మిత్రులని, గ్రామస్థులని ఒకచోట ఉన్న కలిసి తలుచుకోలేని పరిస్థితి, కానీ హైదరాబాద్ లో స్థిరపడ్డ గుంటూరు జిల్లా
విద్య ఉపాధి కోసం గ్రామాల నుండి హైదరాబాద్ లాంటి మాహానగరాలకి వచ్చి ఈ ఉరుకుల పరుగుల జీవితాలలో మన సొంత ఊరుని, ఊరి వాతావరణం తో పెన వేసుకున్న జ్ఞాపకాలను మనతో పెరిగిన మిత్రులని, గ్రామస్థులని ఒకచోట ఉన్న కలిసి తలుచుకోలేని పరిస్థితి, కానీ హైదరాబాద్ లో స్థిరపడ్డ గుంటూరు జిల్లాతాళ్లచెరువు గ్రామస్తులు అందుకు మినహాయింపు అని మరియు ఎక్కడ ఉన్న ఏ స్థాయి లో స్థిరపడ్డ ఒకరికి ఒకరం ఉన్నామంటూ గ్రామస్తులందరూ సెమి క్రిస్మస్ సందర్భంగా అని మరోసారి నిరూపించారు.. !
క్రిస్మస్కు చాలా రోజుల ముందే పండుగ సందడి మొదలవుతుంది. దీనికోసం క్రైస్తవులు తమ ఇళ్లను, చర్చ్‌లను అందంగా అలంకరిస్తారు. వెదురు బద్దలు, రంగుల కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారుచేసి ఇంటిపై వేలాడ దీస్తారు. అలాగే తమ ఇంట్లో క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేస్తారు. దీన్ని రంగు రంగుల కాగితాలు, నక్షత్రాలు, చిరుగంటలు, చిన్న చిన్న గాజు గోళాలతోను అలంకరిస్తారు. ఇది ఈ పండుగ ప్రత్యేకత.
అయితే ఈ పండుగ లో భాగంగా హైదరాబాద్ - బాసురేగడి ప్రవీణ్ రెడ్డి ఫార్మ్ హౌస్ లో ఆదివారం తాళ్లచెరువు గ్రామస్తులు నాలుగవ సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.. హైదరాబాద్ లో స్థిరపడ్డ గుంటూరు జిల్లా తాళ్లచెరువు గ్రామస్తులు అందరూ ఒకచోటకు చేరి సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు.. ఫాదర్ పుట్టి ఆంథోనీ రాజు దైవ సందేశాన్ని అందిస్తూ బాల యేసు జననం లోకానికే వెలుగులను నింపిందన్నారు. ఏసుక్రీస్తు బోధనలు అనునిత్యం అనుసరించదగిన మార్గదర్శకాలని అన్నారు. ఫాదర్ వంగా జోసెఫ్ మా ట్లాడుతూ పవిత్ర గ్రంథంలోని ప్రతి వాక్యం కూడా దేవుని మాటలని ప్రతి విశ్వాసి ఆచరించి ఇరుగుపొరుగు వారికి సహాయ పడాలని కోరారు. అచ్చంపేట ZPTC తుమ్మా పాపి రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యి గ్రామస్థులందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలలో సుమారు 120 మంది గ్రామస్తులు మరియు వారి పిల్లలు పాల్గొన్నారు. ఎప్పుడు మొబైల్ లో గేమ్స్ ఆడే పిల్లలు రోజంతా చక్కగా వివిధ ఆటలు మరియు టేలెంట్ షో లో చురుగ్గా పాల్గొన్నారు. డ్రాయింగ్ కాంపిటీషన్, టగ్ అఫ్ వార్, మ్యూజికల్ చైర్స్, తంబోలా అండ్ మేజిక్ షో కార్యక్రమంలో లో హైలైట్ గా నిలిచాయని మరియు గ్రామస్థులందరి ప్రోత్సాహం తోనే ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిగిందని, అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు(Merry Christmas) తెలుపుతు నిర్వాహుకులు ఏరువ కిరణ్, తుమ్మా సతీష్ మరియు తదితర కమిటీ సభ్యులు తెలుగుపోస్టు తో అన్నారు. ఈ పండుగ సందర్భం గా అందరికీ శుభాలు కలుగాలని ఆకాంక్షిస్తున్నాము. మీ ఆత్మీయులు, మిత్రులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నామని విచ్చేసిన తాళ్లచెరువు గ్రామాస్థులు తెలిపారు.