Wed Nov 06 2024 15:23:50 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి ఆషాఢ మాస బోనాలు ప్రారంభం
హైదరాబాద్ లో నేటి నుంచి ఆషాడ మాస బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి
హైదరాబాద్ లో నేటి నుంచి ఆషాడ మాస బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జరగనున్న బోనాల ఉత్సవాలు ఈరోజు ఆదివారం ప్రారంభం కానున్నాయి. గోల్కొండ లోని శ్రీ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం, తొట్టెల ఊరేగింపు జరగనుంది. ఆగస్టు నాలుగో తేదీ వరకూ బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. ప్రభుత్వం ఈ మేరకు బోనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈరోజు ఆదివారం కావడంతో బోనాలకు అంకురార్పణ జరగనుంది. గోల్కొండలోని జగదాంబిక, మహంకాళీ అమ్మవార్లు తొలి బోనం అందుకుంటారు. ప్రభుత్వం బోనాల ఉత్సవాల కోసం ఇరవై కోట్ల రూపాయలను కేటాయించింది.
గోల్కొండ బోనాలు...
తొలిపూజ కావడంతో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పి్తారరు. లంగర్హౌస్ నుంచి ఊరేేగింపుగా వెళ్లి చోటా బజార్ లోని పూజారి ఇంట్లో ఉన్న అమ్మవారి ఉత్సవాలకు పట్టు వస్త్రాలను సమర్పించనున్నార. తర్వాత అమ్మవారి ఊరేగింపు గోల్కొండ కోటకు చేరుకుంటుంది. ఆలయలో అమ్మవారి ఘటాలను ఉంచిన తర్వాత భక్తులు బోనాలను అమ్మవారికి సమర్పిస్తారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది.
Next Story