Thu Dec 19 2024 11:06:19 GMT+0000 (Coordinated Universal Time)
కొత్తపేట పండ్ల మార్కెట్ కూల్చివేత ప్రారంభం
కొత్త పేట పండ్ల మార్కెట్ ను అధికారులు కూల్చి వేస్తున్నారు. మార్కెట్ ను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే
కొత్త పేట పండ్ల మార్కెట్ ను అధికారులు కూల్చి వేస్తున్నారు. కొత్త పేట పండ్ల మార్కెట్ ను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే న్యాయస్థానాన్ని ఆశ్రయించి కొందరు మార్కెట్ తరలింపును అడ్డుకుంటున్నారు. దీంతో అర్థరాత్రి నుంచి కొత్త పేట పండ్ల మార్కెట్ ను కూల్చివేయాలని రాగా, వ్యాపారులు అడ్డుకున్నారు.
కొహెడకు తరలించాలని....
దీంతో కొద్ది సేపటి క్రితం కొత్త పేట పండ్ల మార్కెట్ కూల్చివేత ప్రక్రియ ప్రారంభమయింది. కొత్త పేట పండ్ల మార్కెట్ కొన్ని దశాబ్దాలుగా ఉంది. అయితే ఇక్కడ జనం రద్దీ ఎక్కువగా ఉండటంతో మార్కెట్ ను కోహెడ కు తరలించాలని నిర్ణయించింది. అక్కడ పండ్ల మార్కెట్ కోసం స్థలాన్ని కేటాయించి దుకాణాలను కూడా తాత్కాలికంగా సిద్ధం చేసింది. అయినా వ్యాపారులు కొత్త పేట నుంచి కదలకపోవడంతో ఈరోజు కూల్చివేత కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.
Next Story