Thu Dec 26 2024 12:13:14 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad: వామ్మో.. ఆటో డ్రైవర్ల విన్యాసాలు హడలెత్తిస్తున్నాయే
హైదరాబాద్ నగరంలో ఆటో డ్రైవర్లు చేస్తున్న స్టంట్స్ సాధారణ జనాన్ని
హైదరాబాద్ నగరంలో ఆటో డ్రైవర్లు చేస్తున్న స్టంట్స్ సాధారణ జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ప్రమాదకరమైన బైక్ స్టంట్లు, అనధికారికంగా రేసుల పెరుగుదల కారణంగా హైదరాబాద్లో రద్దీగా ఉండే రోడ్లపై ఆటో రిక్షా స్టంట్లు కూడా పెరిగిపోతున్నాయి. అక్టోబరు 24న యూట్యూబ్లో ‘రాజు ఆటో డ్రైవర్’ అనే వినియోగదారు షేర్ చేసిన వీడియో, ఇన్స్టాగ్రామ్లో అరిబ్ ఖాన్ రీపోస్ట్ చేసిన వీడియోలను చూస్తుంటే వీరందరూ ఫేమ్ కోసం ఇలా స్టంట్స్ చేస్తూ ఇతరులు అటు వైపుగా వెళ్లాలంటేనే భయపడే స్థితికి తీసుకుని వచ్చారేమోనని అనిపిస్తూ ఉంది. ఆటో-రిక్షా డ్రైవర్ తనకే కాకుండా పాదచారులకు, ఇతర వాహనదారులకు కూడా ప్రమాదం కలిగించే స్థాయిలో విన్యాసాలు చేశాడు.
ఈ వీడియో వైరల్ అవ్వడంతో చాలా మంది నెటిజన్లు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇలాంటి స్టంట్స్ లో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. నగరంలోని రోడ్లపై ఇలాంటి నిర్లక్ష్యపు ప్రవర్తనను అరికట్టేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని పలువురు వినియోగదారులు సైబరాబాద్ పోలీసులకు ట్యాగ్ చేశారు. హైదరాబాద్ లోని పలు రోడ్లపై అనధికారికంగా రేసులు జరుగుతూ ఉన్నాయి. మనం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఎంతో మంది ఇలాంటి ఓవరాక్షన్ చేస్తున్న డ్రైవర్ల వివరాలు దొరికిపోతాయని నెటిజన్లు అంటున్నారు. T-హబ్ రోడ్, నాలెడ్జ్ సిటీ లో రాయదుర్గం పోలీసులు అప్పుడప్పుడు రైడ్స్ చేస్తూ ఇలాంటి డ్రైవర్లను పట్టుకుంటూ ఉంటారు. హైదరాబాద్లోని పబ్లిక్ రోడ్లపై విన్యాసాలు, రేసింగ్లు చేస్తూ ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉందని పలువురు గుర్తించారు.
Next Story