Mon Mar 31 2025 15:44:10 GMT+0000 (Coordinated Universal Time)
ప్రేమికుల దినోత్సవం నాడు భజరంగ్ దళ్ వార్నింగ్ ఇదే
ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకం కాదని భజరంగ్ దళ్ పేర్కొంది. అలాగని ఆ పేరుతో ఈవెంట్స్ చేస్తే అంగీకరించబోమని చెప్పింది

ప్రేమికుల దినోత్సవానికి తాము వ్యతిరేకం కాదని భజరంగ్ దళ్ పేర్కొంది. అలాగని ఆ పేరుతో ఈవెంట్స్ చేస్తే అంగీకరించబోమని చెప్పింది. భజరంగ్ దళ్ ఎవరికీ బలవంతంగా వివాహాలు చేయదని పేర్కొంది. ప్రేమికుల దినోత్సవం సందర్బంగా కొందరు భజరంగ్ దళ్ పేరిట పెళ్లిళ్లు చేశారని, వాటితో తమకు సంబంధం లేదని చెప్పింది. ప్రేమ పేరుతో బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా వ్యవహరిస్తే ఊరుకోబోమని భజరంగ్ దళ్ హెచ్చరించింది. కోటి చౌరస్తాలో ఈరోజు అమరవీరుల దినోత్సవాన్ని భజరంగ్ దళ్ నిర్వహించింది.
పార్కుల మూసివేత....
ఈరోజు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో అన్ని ప్రధాన పార్కులను పోలీసులు మూసివేశారు. ఇందిరాపార్కును పూర్తిగా పోలీసులు మూసివేశారు. పార్కుల వద్ద ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రధాన పార్కులన్నీ పోలీసులు మూసివేయడంతో వెలవెలబోతున్నాయి.
Next Story