Mon Dec 23 2024 11:33:00 GMT+0000 (Coordinated Universal Time)
రికార్డుస్థాయి ధరకు బాలాపూర్ లడ్డూ
బాలాపూర్ లడ్డూ రికార్డు స్థాయి ధర పలికింది. గత ఏడాది కంటే అత్యధిక ధర పలికింది.
బాలాపూర్ లడ్డూ రికార్డు స్థాయి ధర పలికింది. గత ఏడాది కంటే అత్యధిక ధర పలికింది. ఈసారి బాలాపూర్ లడ్డూ ఇరవై ఏడు లక్షల రూపాయలు ధర పలికింది. దయానంద్ రెడ్డి అనే వ్యక్తి బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. వేలంలో దాసరి దయానంద్ రెడ్డి దక్కించుకుని తన సొంతం చేసుకున్నారు. బాలాపూర్ లడ్డూ వేలం గత ఏడాది 24.60 లక్షల రూపాయలు పలికింది. ఈసారి వేలంలో 36 మంది పాల్గొన్నారు. గ్రామంలో వినాయకుడి యాత్ర పూర్తయిన తర్వాత ఈ లడ్డూ వేలం జరుగుతుంది. గత ఏడాది కంటే అత్యధికంగా ఈసారి ధర పలికింది.
భక్తిభావంతో...
బాలాపూర్ లడ్డూ అంటేనే అదో భక్తి భావంతో కూడుకున్నది. బాలాపూర్ లడ్డూ వేలం ప్రారంభమై నేటికి ముప్ఫయి ఏళ్లు అయింది. మూడు దశాబ్దాల నుంచి బాలాపూర్ లడ్డూను వేలం వేస్తున్నారు. ఈ లడ్డూను దక్కించుకోవడానికి అనేక మంది పోటీ పడతారు. ఆ లడ్డూను తమ పొలాల్లో చల్లుకుంటే పంటలు సమృద్ధిగా పండుతాయని భావిస్తారు. లడ్డూ దక్కించుకున్న వారి ఇంటి సుఖసంతోషాలుంటాయని భావిస్తారు. అందుకే ఈ లడ్డూను సొంతం చేసుకునేందుకు పదుల సంఖ్యలో, చూసేందుకు వేల మంది భక్తులు పాల్గొంటారు.
Next Story