Tue Nov 05 2024 16:36:26 GMT+0000 (Coordinated Universal Time)
ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య.. పోలీసుల అదుపులో స్కూటర్ వ్యాపారి
సికింద్రాబాద్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీలు పేలాయి. ఈ స్కూటర్ల లను హోటల్ సెల్లార్ లో ఉంచారు.
సికింద్రాబాద్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీలు పేలాయి. ఈ స్కూటర్ల బ్యాటరీలను హోటల్ సెల్లార్ లో ఉంచారు. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించడంతో ఎలక్ట్రిక్ స్కూటర్ వ్యాపారి రంజిత్ సింగ్ బగ్గాపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసు అదుపులో రంజిత్ బగ్గతో పాటు హోటల్ మేనేజర్ కూడా ఉన్నారు. బ్యాటరీలు ఛార్జింగ్ పెడుతున్న సమయంలో మంటలు వ్యాపించి దట్టమైన పొగలు వ్యాపించడమే కాకుండా మంటలు అంటుకున్నాయి. నాలుగు అంతస్థుల భవనంలో ఈ లాడ్జి ఉంది. లాడ్జి లోపలికి, బయటకు వెళ్లేందుకు ఒకే దారి ఉండటం విశేషం.
మృతుల్లో కొందరు..
ప్రమాదం జరిగిన రూబీ లగ్జరీ హోటల్ ను అధికారులు సీజ్ చేశారు. మృతుల్లో విజయవాడ కు చెందిన హరీష్, చెన్నై కు చెందిన సీతారామన్, ఢిల్లీ కి చెందిన వీతెంద్ర ఉన్నారు. మిగిలిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హోటల్ గదిలో ఉన్న సమాచారాన్ని బట్టి టూరిస్టుల పేర్లను పోలీసులు సేకరిస్తున్నారు. ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని కొందరిని ప్రయివేటు ఆసుపత్రులకు, మిగిలిన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Next Story