టాప్ లో హైదరాబాద్.. ఆనందంలో కేటీఆర్
తెలంగాణ రాజధాని హైదరాబాద్ మరో రికార్డును అందుకుంది. ఉత్తమ జీవన ప్రమాణాలతో
తెలంగాణ రాజధాని హైదరాబాద్ మరో రికార్డును అందుకుంది. ఉత్తమ జీవన ప్రమాణాలతో కూడిన ప్రపంచ నగరాల ర్యాంకింగ్స్ లో భాగంగా దేశంలోనే బెస్ట్ సిటీగా మన హైదరాబాద్ నిలిచింది. పుణే, బెంగళూరు లాంటి ఐటీ నగరాలను వెనక్కి నెట్టి అత్యుత్తమ నగరంగా నిలిచింది. హైదరాబాద్ బెస్ట్ సిటీగా నిలవడం 2015 నుంచి ఇది ఆరోసారి. ‘మెర్సర్’ అనే అమెరికాకు చెందిన కన్సల్టెన్సీ, ఆర్థిక సేవల సంస్థ తాజాగా ఉత్తమ జీవన ప్రమాణాలతో కూడిన ప్రపంచ నగరాల ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ ర్యాకింగ్‌లో భారతదేశం నుంచి హైదరాబాద్ మాత్రమే కాకుండా పూణే, బెంగళూరు, చెన్నై, ముంబై నగరాలకు చోటు దక్కింది. వీటన్నిటిలోనూ హైదరాబాద్ నగరం ముందు ఉండడం విశేషం. ఈ లిస్టులో హైదరాబాద్‌కు 153వ స్థానం దక్కగా.. పుణే 154, బెంగళూరు 156వ స్థానంలో నిలిచాయి. చెన్నై 161, ముంబై 164, కోల్కత్తా 170, న్యూ ఢిల్లీ 172 స్థానాల్లో ఉన్నాయి.