Mon Dec 23 2024 19:57:39 GMT+0000 (Coordinated Universal Time)
గణేష్ నిమజ్జనంపై ఉత్కంఠ
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఈరోజు హుస్సేన్ సాగర్ చుట్టూ బైక్ ర్యాలీని నిర్వహించనుంది.
గణేష్ నిమజ్జనంపై హైదరాబాద్ లో ఉత్కంఠ నెలకొంది. ఇంతవరకూ హుస్సేన్ సాగర్ లో క్రేన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంపై గణేష్ నిమజ్జనంపై సస్పెన్స్ ఉంది. దీంతో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఈరోజు హుస్సేన్ సాగర్ చుట్టూ బైక్ ర్యాలీని నిర్వహించనుంది. ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను గణేష్ ఉత్సవ సమితి పరిశీలించనుంది.
ఎప్పటిలాగానే....
ఎప్పటిలాగే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం ఏర్పాటు చేయాలని గణేష్ ఉత్సవ సమితి డిమాండ్ చేసింది. హుస్సేన్ సాగర్ చుట్టూ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను ఈరోజు పరిశీలించనుంది. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు ప్రాంతాల్లో క్రేన్ లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తుంది. ఈ నెల 9వ తేదీన గణేష్ నిమజ్జనం చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
Next Story