Mon Dec 23 2024 16:19:25 GMT+0000 (Coordinated Universal Time)
మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్
ఈ నిర్ణయంతో మెట్రో ప్రయాణికులు షాకవుతున్నారు. ఇప్పటివరకూ కొన్ని స్టేషన్లలో మాత్రమే పబ్లిక్ టాయిలెట్స్..
హైదరాబాద్ మెట్రో మరోసారి ప్రయాణికులకు షాకిచ్చింది. ఇప్పటికే మెట్రో ప్రయాణ ఛార్జీల్లో ఎల్ అండ్ టీ సంస్థ కోత విధించిన విషయం తెలిసిందే. తాజాగా మెట్రో స్టేషన్లలో టాయిలెట్స్ కు కూడా ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో మెట్రో ప్రయాణికులు షాకవుతున్నారు. ఇప్పటివరకూ కొన్ని స్టేషన్లలో మాత్రమే పబ్లిక్ టాయిలెట్స్ అందుబాటులో ఉండగా.. వాటిని ఉపయోగించుకునే ప్రయాణికుల నుండి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయట్లేదు. కానీ ఇకపై వాటికి కూడా ఛార్జీలు వసూలు చేయాలని ఎల్అండ్ టీ నిర్ణయించింది.
రానున్న రోజుల్లో హైదరాబాద్ లోని అన్ని మెట్రో స్టేషన్లలో టాయిలెట్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చి, వాటిని ఉపయోగించుకునే ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది. మెట్రో ప్రాజెక్టును లాభదాయకంగా మార్చేందుకు ఎల్ అండ్ టీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది. టాయిలెట్ వాడకానికి రూ.5, యూరినల్ వాడకానికి రూ.2 వసూలు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. దీనితో ఇప్పటికే టికెట్ ఛార్జీల పెంపుతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు మరో షాక్ తగిలింది.
Next Story