Mon Mar 24 2025 13:48:55 GMT+0000 (Coordinated Universal Time)
టీటీడీ బోర్డు నిర్ణయంపై రాజాసింగ్ ఏమన్నారంటే?
అసదుద్దీన్ వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు

అసదుద్దీన్ వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వార్తల్లో కనిపించేందుకే అసదుద్దీన్ అప్పుడప్పుడు మాట్లాడతారంటూ రాజాసింగ్ మండి పడ్డారు. తిరుమల తిరపతి దేవస్థానంలో హిందువులే పనిచేయాలనడం కరెక్టే నని, టీటీడీ చైర్మన్ మంచి నిర్ణయం తీసుకున్నారని రాజాసింగ్ కితాబిచ్చారు.
అసద్ కు కౌంటర్...
వక్ఫ్‌బోర్డ్‌తో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒవైసీ పోల్చడం సరికాదన్న రాజాసింగ్ 1947లో వక్ఫ్‌బోర్డ్ భూములు ఎన్ని ఉన్నాయని ప్రశ్నించారు. హిందూ రైతుల నుంచి భూములు కబ్జా చేశారంటూ రాజాసింగ్ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ భూములపై మంచి చట్టం రాబోతోందంటూ రాజాసింగ్ తెలిపారు.
Next Story