Wed Oct 30 2024 05:33:01 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మూడు విమానాలకు బాంబు బెదిరింపులు
నేడు శంషాబాద్ ఎయిర్పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి
నేడు శంషాబాద్ ఎయిర్పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లాల్సిన రెండు విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టులో విమానాలను నిలిపి వేసి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు లో అధకిారులు అప్రమత్తమయ్యారు.
శంషాబాద్ ఎయిర్పోర్టులో...
మూడు విమానాల్లో రెండు చెన్నై వెళ్లాల్సిన ఇండిగో విమానాలు ఉండగా, మరొకటి చెన్నై నుంచి హైదరాబాద్ కు రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం కూడా ఉంది. అయితే మూడు విమానాలను శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిలిపివేసి తనిఖీలు చేయగా అందులో ఏమీ లేదని తేల్చారు. ఇటీవల విమానాల్లో బాంబు బెదిరింపుల కాల్స్, ఈ మెయిల్స్ అధికంగా వస్తుండటంతో ప్రయాణాలు ఆలస్యమవుతున్నాయి.
Next Story