బ్రీత్ అనలైజర్ టెస్ట్ వద్దన్న సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ.. హైదరాబాద్ పోలీసుల అదుపులో!
ఎస్ఆర్ నగర్లో తన స్నేహితుడికి డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించకుండా
ఎస్ఆర్ నగర్లో తన స్నేహితుడికి డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించకుండా పోలీసులను అడ్డుకున్న సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు ప్రయాణిస్తున్న ముగ్గురు సహచరులను కూడా అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. మధురానగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఏసీపీ సుమన్ కుమార్, వ్యాపారి జైపాల్ రెడ్డి, మరో ఇద్దరు సహచరులు సఫారీ వాహనంలో అమీర్‌పేట నుంచి ఎస్‌ఆర్‌నగర్‌కు వెళ్తుండగా ఎస్ఆర్నగర్ మెట్రో స్టేషన్ దగ్గర సంజీవ్‌రెడ్డి నగర్‌కు చెందిన ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ డ్రైవింగ్ తనిఖీ చేయడం గమనించారు. కారు నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో వెనుక సీటుకు వెళ్లి మరొక ప్రయాణికుడు డ్రైవర్ సీటుకు మారాడు. డ్యూటీలో ఉన్న లేడీ కానిస్టేబుల్ కావేరి సీట్లు మారడం గమనించి, అసలు డ్రైవర్ బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని అనుమానించి ఉన్నతాధికారులను అప్రమత్తం చేసింది.