Thu Nov 14 2024 07:05:38 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad: ఫేక్ టికెట్స్ తో విమానం ఎక్కేయాలనుకున్నారు
నకిలీ టిక్కెట్లు ఉపయోగించి విమానాశ్రయంలోకి ప్రవేశించారనే
నకిలీ టిక్కెట్లు ఉపయోగించి విమానాశ్రయంలోకి ప్రవేశించారనే ఆరోపణలపై రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGI) పోలీస్ స్టేషన్లో ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదైంది. నవంబర్ 11, 2024 ఉదయం 11:00 గంటలకు విమానాశ్రయంలోని CISF అధికారి వీరేంద్ర సింగ్ వీరిపై ఫిర్యాదు చేశారు.
ఎఫ్ఐఆర్ నివేదిక ప్రకారం, ఈ సంఘటన అదే రోజు తెల్లవారుజామున 2:00 గంటలకు జరిగింది. ముగ్గురు ప్రయాణికులను అఫ్జల్ ఉర్ రెహ్మాన్, షేక్ షాహెద్ పాషా, అయాజ్ అహ్మద్ షేక్ అని గుర్తించారు, వీరు ఎతిహాద్ ఎయిర్వేస్ విమానంలో హైదరాబాద్ నుండి అబుదాబికి వెళ్లడానికి ఇ-టికెట్ను ప్రదర్శించడం ద్వారా అంతర్జాతీయ ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ (పిటిబి)కి యాక్సెస్ పొందారు. చెక్-ఇన్ కౌంటర్లో ఎతిహాద్ ఎయిర్వేస్ సిబ్బంది టిక్కెట్లను పరిశీలించినప్పుడు నవంబర్ 11, 2024న షెడ్యూల్ చేసిన విమానంలో ప్రయాణీకుల లిస్టులో ఈ ముగ్గురు ప్రయాణీకులు లేరని కనుగొన్నారు. తమ దగ్గర ఇ-టికెట్లు మాత్రమే ఉన్నాయని, అబుదాబిలోని ఒక ఏజెంట్ ద్వారా ఇవి తమకు అందాయని తెలిపారు.
విచారణలో నకిలీ టిక్కెట్లను ఉపయోగించి విమాన ప్రయాణం చేయాలని అనుకున్నారని తేలింది. తదుపరి విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించారు. బీఎన్ఎస్లోని 318(4), 336(3), 340(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తును మొదలుపెట్టారు పోలీసులు.
Next Story