Fri Nov 22 2024 21:08:17 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రయాన్–3 మిషన్.. హైదరాబాద్ కు ప్రత్యేక స్థానం
చంద్రయాన్-3 మిషన్ లో హైదరాబాద్ కు చెందిన సంస్థలు కీలక భూమికను పోషిస్తూ ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఏరోస్పేస్
ప్రతిష్టాత్మక చంద్రయాన్–3 మిషన్‌ను చంద్రుని దక్షిణ ధ్రువంపైకి పంపేందుకు సర్వం సిద్దమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగవేదిక నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు ఎల్వీఎం3–ఎం4 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఈ ప్రయోగం జరగనుంది. అన్ని ఏర్పాట్లనూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పటికే పూర్తి చేసింది.
చంద్రయాన్-3 మిషన్ లో హైదరాబాద్ కు చెందిన సంస్థలు కీలక భూమికను పోషిస్తూ ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఏరోస్పేస్ అండ్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ కంపెనీలు జియోసింక్రోనస్ లాంచ్ వెహికల్ మార్క్ III (GSLV Mk-III) అంతరిక్ష నౌక ల్యాండర్, రోవర్ కు సంబంధించిన భాగాల తయారీలో భాగమయ్యాయి. రామచంద్రపురంలోని శ్రీ వెంకటేశ్వర ఏరోస్పేస్ సంస్థ మార్క్-111 రిలీజ్ మెకానిజానికి సంబంధించిన సహ నిర్మాణ భాగాలను అందించింది. చంద్రయాన్-3 కోసం మిధాని సంస్థ కూడా క్లిష్టమైన మిశ్రమాలను సరఫరా చేసింది. MTAR టెక్నలాజిస్, అనంత టెక్నాలజీస్ సంస్థలు కూడా కీలక భాగాలను సరఫరా చేశాయి. ల్యాండర్, ఆర్బిటర్, ప్రొపల్షన్ మాడ్యూల్స్‌లో ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీలను రక్షించడానికి అల్యూమినియం అల్లాయ్ కేస్‌ను నాగ సాయి ప్రెసిషన్ ఇంజనీరింగ్ వర్క్స్ అందించింది.
శ్రీ వెంకటేశ్వర ఏరో స్పేస్ డైరెక్టర్ సత్య నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. "మేము MK 111-కోర్ బేస్ ష్రౌడ్, L-110 సెపరేషన్ సిస్టమ్స్, S-200 నాజిల్స్ ఆఫ్ ఫస్ట్-స్టేజ్ మోటార్లు, S-200 సెపరేషన్ సిస్టమ్స్‌ని సరఫరా చేసాము. అంతేకాకుండా ఆక్సిలరీ మోటార్లు, ఇతర భాగాలు చంద్రయాన్-3 లూనార్ మిషన్ కోసం అందించాము." అని తెలిపారు. ఇస్రో మిషన్లలో మా యూనిట్ కీలక సహకారం అందించినందుకు మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. మేము PSLV, GSLV, GSLV MK-3, SSLV ప్రోగ్రామ్స్ కు సంబంధించి సబ్ సిస్టమ్స్ ను కూడా సరఫరా చేసాము. DRDO కు చెందిన అగ్ని, పృథ్వీ, ఆకాష్, ప్రలయ్, B-05, K-4, K-5, ఆస్ట్రా క్షిపణుల తయారీకి కూడా కావాల్సిన సహకారం అందించాము" అని చెప్పుకొచ్చారు.
మెకానికల్ బ్యాటరీ స్లీవ్లను నాగసాయి ప్రెసిషన్ ఇంజనీర్స్ (NSPE) సంస్థ తయారు చేసి సరఫరా చేసింది. ఈ సంస్థకు చెందిన భూషణ్ రెడ్డి మాట్లాడుతూ.. " ఏరోస్పేస్ పరిశ్రమలకు విడి భాగాలను తయారు చేయడం, సరఫరా చేయడంలో మాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది. ISO-ఆమోదిత ఫ్యాబ్రికేటర్లను URSC, ISRO ఉపయోగిస్తాయి. మేము GEO, LEO, చిన్న ఉపగ్రహ ప్రోగ్రామ్‌ల కోసం 1998 నుండి అనేక ఫాబ్రికేషన్ ఒప్పందాలను అమలు చేసాము. అధిక థ్రస్ట్‌ను నిరోధించగల బ్యాటరీ స్లీవ్లను తయారు చేయడానికి మూడు నెలలు పట్టింది. వీటిని ఒకప్పుడు ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకునే వాళ్లు.. ఇప్పుడు అవి దేశీయంగా అభివృద్ధి చేస్తున్నాం." అని అన్నారు.
బాలా నగర్ లోని MTAR టెక్నాలజీస్ కూడా చంద్రయాన్-3 కి సంబంధించిన కీలక భాగాల తయారీలో భాగమైంది. లిక్విడ్ ప్రొపల్షన్ వికాస్ ఇంజిన్, క్రయోజెనిక్ ఇంజిన్, ఫోర్క్ ప్రెజరైజేషన్ కోసం లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ మాడ్యూల్స్, రోల్ కంట్రోల్, పోగో కంట్రోలర్, కమాండ్ సిస్టమ్స్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ, శాటిలైట్ అండ్ ప్రెసిషన్ బాల్ స్క్రూల కోసం, హై సైక్లిక్ లైఫ్ వాల్వ్‌లు, PSLV, GSLV, GSLV కోసం హైడ్రాలిక్ యాక్యుయేటర్ అసెంబ్లీలు ISRO, మార్క్ III ఉపగ్రహాల కోసం పని చేశామని MTAR టెక్నాలజీస్ సంస్థ తెలిపింది. పావలూరి సుబ్బారావు నేతృత్వంలోని అనంత్ టెక్నాలజీస్ చంద్రయాన్-2లో కూడా భాగమయ్యారు. అంతరిక్ష నౌకకు సెన్సార్లను అందించారు.
Next Story