Tue Jan 07 2025 22:21:44 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : ఎన్నికలప్పుడే రాజకీయాలు.. తర్వాత ఎంఐతో కలసి పనిచేస్తాం
ఆరాంఘర్ - జూపార్క్ ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు
ఆరాంఘర్ - జూపార్క్ ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మళ్లీ నగరంలో రెండో అతిపెద్ద ఫ్లేఓవర్ ను నిర్మించుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల విస్తరణ, తాగునీటి సౌకర్యం, మెట్రోరైలు విస్తరణ వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు. గోదావరి జలాలను నగరానికి తీసుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. హైదరాబాద్ నగరాన్ని లేక్ అండ్ రాక్ సిటీగా నాడు నిజాం చేసి అభివృద్ధిని చూసుకుంటే అప్పుడు హైదరాబాద్ నగరంతో పోటీ పడే మరో నగరం లేదని ముఖ్యమంత్రి అన్నారు. భూ కబ్జాలతో నేడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని ఆయన అన్నారు.
ఎన్నికలప్పుడే రాజకీయాలు...
ఎన్నికలప్పుడే రాజకీయాలను చేస్తామని, ఎన్నికలు ముగిసిన వెంటనే ఎంఐఎంతో కలసి హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పారు. మూసీ నదిని పరిరక్షించుకోవాల్సిన అవసరం వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గతపదేళ్లలో హైదరాబాద్ మెట్రో రైలును విస్తరించలేదన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో హైదరాబాద్ కు మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేలతో ఈ నెల 11న సెక్రటేరియట్ లో సమావేశమై హైదరాబాద్ నగరంలో నెలకొన్న సమస్యలపై చర్చించునున్నట్లు ఆయన తెలిపారు. ఇది ఓల్డ్ సిటీ కాదని, ఒరిజినల్ సిటీ అని రేవంత్ అన్నారు. మోదీతో కొట్లాడి పాతబస్తీకి మెట్రో రైలును తెస్తున్నానని తెలిపారు.
ఫ్లైఓవర్ కు మన్మోహన్ సింగ్ పేరు...
హైదరాబాద్ నగరం అభివృద్ధికోసం ఎన్ని నిధులు ఖర్చు చేయడానికైనా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. చంద్రాయణగుట్టలో ఇంజినీరింగ్ కళాశాలతో పాటు ఇంటర్, డిగ్రీకళాశాలను మంజూరు చేస్తామని రేవంత్ రెడ్డి తెిపారు. మీరాలం ట్యాంక్ పై కేబుల్ బ్రిడ్జిని నిర్మిస్తామని చెప్పారు. ఆరాంఘర్ - జూపార్క్ ఫ్లైఓవర్ కు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరును పెడుతున్నామని తెలిపారు. ఎయిర్ పోర్టుకు వెళ్లే రెండు ఫ్లైఓవర్ లను మాజీ ప్రధానుల పేర్లు పెట్టినట్లవుతుందని చెప్పారు. పాతబస్తీలో సమస్యలను పరిష్కరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని రేవంత్ రెడ్డి తెలిపారు. యాకత్ పుర రోడ్డు విస్తరణ పనులు చేపడతామని తెలిపారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలుకల్పించే బాధ్యత తనదేనని అన్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ
Next Story