Hyderabad : ఇక అక్కడ భూముల ధరలకు రెక్కలు తప్పవు.. మెయిన్ రీజన్ ఇదే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న తాజా నిర్ణయంతో హైదరాబాద్ లోని ఉత్తర ప్రాంతంలో ఉన్న భూముల ధరలు మరింత పెరగనున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న తాజా నిర్ణయంతో హైదరాబాద్ లోని ఉత్తర ప్రాంతంలో ఉన్న భూముల ధరలు మరింత పెరగనున్నాయి. ఇప్పటికే ఆ ప్రాంతంలో ధరలు ఆకాశాన్నంటాయి. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ధరలు మరింత పెరిగే అవకాశముందని తెలిసింది. మేడ్చల్, కొంపల్లి, శామీర్ పేట్ వరకూ భూముల ధరలకు ఇక రెక్కలు వస్తాయి. అందుకు ప్రధాన కారణం మెట్రో రైలు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడమే. ఇప్పటికే ఈ ప్రాంతం విస్తరించింది. దాదాపు మేడ్చల్ వరకూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేశారు. అనేక చోట్ల ఈ ప్రాంతంలో వేసిన వెంచర్లు అలాగే ఉన్నాయి. అమ్ముడు పోవడం లేదు. సిటీకి రావాలంటే కష్టంగా మారడం వల్లనే ఈ ప్రాంతంలో కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now