లోన్ యాప్స్ గురించి సంచలన విషయాలు బయటపెట్టిన హైదరాబాద్ పోలీసులు
లోన్ యాప్స్.. ఎక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చి ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే..! లోన్ యాప్స్ పెడుతున్న టార్చర్ కు చాలా మంది ప్రాణాలను కూడా విడిచిపెడుతూ ఉన్నారు.
లోన్ యాప్స్.. ఎక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చి ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే..! లోన్ యాప్స్ పెడుతున్న టార్చర్ కు చాలా మంది ప్రాణాలను కూడా విడిచిపెడుతూ ఉన్నారు. ఈ లోన్ యాప్స్ వెనుక చైనా కంపెనీలు ఉన్నాయి. కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ల నుండి నేపాల్‌కు వచ్చిన కాల్‌లను హైదరాబాద్ సిటీ పోలీసులు ట్రేస్ చేశారు. చైనీస్ ఇన్స్టంట్ లోన్ యాప్ కేసు విచారణ చేస్తున్నారు పోలీసులు. అమాయక బాధితులను మోసం చేస్తున్నాయి ఈ కంపెనీలు. ఈ కంపెనీకి చెందిన భారతదేశంలోని ఉద్యోగులను అరెస్టు చేయడంతో లోన్ యాప్స్ కంపెనీలు తమ స్థావరాన్ని నేపాల్, భూటాన్, ఫిలిప్పీన్స్‌కు మార్చాయి. సాధారణంగా ఎగ్జిక్యూటివ్‌లుగా పిలువబడే మనీ కలెక్షన్ ఏజెంట్ల డిజిటల్ షేమింగ్ కారణంగా ప్రజలు ఆత్మహత్య చేసుకున్న తర్వాత భారతదేశంలోని అనేక నగరాల్లో పోలీసులు చైనీస్ లోన్ యాప్ కంపెనీలపై కేసులు నమోదు చేశారు. "కేసుల విచారణలో నేపాల్, భూటాన్, ఫిలిప్పీన్స్‌లో సర్వర్లు, బ్యాకెండ్ కార్యకలాపాలు ఉన్నాయని మేము కనుగొన్నాము" అని హైదరాబాద్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.