Mon Dec 23 2024 19:28:26 GMT+0000 (Coordinated Universal Time)
ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ లో 112 కోట్ల జమ
హైదరాబాద్ లో ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ కు మంచి స్పందన లభిస్తుంది. ఇప్పటి వరకూ 112.98 కోట్ల రూపాయలు ఖజానాకు జమ అయ్యాయి
హైదరాబాద్ లో ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ కు మంచి స్పందన లభిస్తుంది. ఇప్పటి వరకూ 112.98 కోట్ల రూపాయలు చలాన్ల రూపంలో వాహనదారులు చెల్లించారు. ఈ నెల 20 వ తేదీ వరకూ 112 కోట్లు చెల్లించారని పోలీసు శాఖ వెల్లడించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ ను పెట్టారు. పెద్దయెత్తున రాయితీలను కూడా కల్పించారు. దీంతో వాహనదారుల నుంచి మంచి స్పందన లభిస్తుంది.
ఈ నెల 20వ తేదీ వరకూ....
మార్చి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ చలాన్లను క్లియర్ చేసుకునే వీలు కల్పించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 63 లక్షల చలాన్లు క్లియర్ అవ్వడంతో 49.6 కోట్లు ఖజానాకు జమ అయింది. సైబారాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 38 లక్షల చలాన్లు క్లియర్ అయ్యాయి. దీంతో 45.8 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చేరింది. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 16 లక్షల చలాన్లు క్లియర్ అయ్యాయి. 15.3 కోట్ల నగదు జమ అయింది.
Next Story